జీ5లో స్టార్ హీరోల జాతర.. లైనప్ చూస్తే ఓటీటీ ఫ్యాన్స్ ఫిదా!
ABN , Publish Date - Aug 29 , 2026 | 08:51 PM
తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు జీ5 (zee 5)మరోసారి భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.
తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు జీ5 (zee 5)మరోసారి భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఒరిజినల్ సిరీస్‌లు, స్టార్ హీరోల సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు, స్పోర్ట్స్ కంటెంట్‌తో కొత్త లైనప్‌ను తీసుకొస్తోంది. ఈ లైనప్‌లో నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శ్రీమతి’, భరత్ నివాస్, శివాజీ రాజా కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పంచనామా’ ఉన్నాయి. అలాగే జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు సీక్వెల్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’ కూడా రానుంది.
స్టార్ హీరోల సినిమాలు
జీ5 కొత్త లైనప్‌లో పలు భారీ సినిమాలు ఉన్నాయి. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘లెనిన్’ ఇందులో ఒకటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ‘ఎన్‌బీకే111’ కూడా జీ5 లైనప్‌లో ఉంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే చైతన్య అక్కినేని, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘వృషకర్మ’, అల్లరి నరేష్, కాజల్ చౌదరి నటిస్తున్న ‘కనక దుర్గ’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘జననాయకుడు’, ‘హాయ్’, ‘డిమాంటీ కాలనీ 2’, ‘ఏ క్వీన్’, ‘వీరప్పన్ 2’ వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఏఐతో కొత్త కథలు
సినిమాలు, సిరీస్‌లతో పాటు ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్‌పైనా జీ5 దృష్టి పెట్టింది. ‘గరుడ’, ‘విక్రమ్ బేతాళ్’, ‘శివ్ సతి’, ‘చంద్రకాంత’, ‘తిరుపతి బాలాజీ’, ‘నర్మద’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’ వంటి టైటిల్స్‌ను ఈ విభాగంలో తీసుకురానుంది. పిల్లల కోసం ‘బార్బరీక్’, ‘కుండక మండక్క’ వంటి కంటెంట్‌ను కూడా అందించనుంది. మరోవైపు ఫిఫా, బుండెస్లిగా, కొప్పా ఇటాలియా, ఐఎల్‌టీ20 వంటి లైవ్ స్పోర్ట్స్‌ను కూడా స్ట్రీమింగ్ చేయనుంది. మొత్తంగా.. సినిమాలు, సిరీస్‌లు, ఏఐ కంటెంట్, పిల్లల కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాల్లో కొత్త కంటెంట్‌తో తెలుగు జీ5 ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.