ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. 

ABN , Publish Date - Apr 11 , 2026 | 10:43 AM

కెన్‌ కరుణాస్‌ (Ken Karunas) హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘యూత్‌’(Youth) చిత్రం ఇప్పుడు డిజిటల్‌ ప్రేక్షకులను పలకరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.

కెన్‌ కరుణాస్‌ (Ken Karunas) హీరోగా నటించి దర్శకత్వం వహించిన  చిత్రం ‘యూత్‌’(Youth). తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం మార్చిలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్ లోను మంచి విజయం సాధించింది. ఇప్పుడు డిజిటల్‌ ప్రేక్షకులను పలకరించేందుకు  ఈ సినిమా సిద్ధమైంది. ఏప్రిల్‌ 16 నుంచి  నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. 

కథ:
ప్రవీణ్ (కెన్ కరుణాస్) 15 ఏళ్ల కుర్రాడు. బేకరీ నడుపుకొంటూ జీవితం సాగించే ఉన్నికృష్ణన్ (సూరజ్ వెంజరమూడు), సరోజ (దేవదర్శిని) దంపతుల ఏకైక కుమారుడు. తల్లికి కొడుకంటే ప్రాణం. తండ్రికి ప్రవీణ్ చేసే పనులు నచ్చవు. ప్రవీణ్ చేష్టలకు అమ్మాయిలు అతని వైపే చూడరు. స్కూల్ చదువు పూర్తయ్యేలోగా అమ్మాయిల ప్రేమను పొందాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రవీణ్. అలా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకునే క్రమంలో ఓ ముగ్గురు అమ్మాయిలు… గంగవల్లి (అనీషా అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనల్ (ప్రియాన్సీ యాదవ్) తారసపడటం.. వారితో ప్రేమ విఫలం కావడం జరుగుతుంది. పదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకూ ప్రవీణ్ కు ఎదురైన అనుభవాలు, అవమానాలు బ్రేకప్స్ అతనికి ఏమి నేర్పించాయి? తల్లిదండ్రులు కోరుకున్న లక్ష్యం చేరుకున్నాడా? అతని ప్రేమకథలు ఏమయ్యాయి? అన్నదే ఈ ‘యూత్’ కథాంశం

Updated Date - Apr 11 , 2026 | 10:43 AM