Na Wife Missing OTT: సరికొత్త థ్రిల్లర్‌తో ఓటీటీకి వచ్చేస్తోన్న.. 'కొత్త బంగారు లోకం' జంట
ABN , Publish Date - Oct 19 , 2026 | 09:47 PM
తెలుగునాట చాలాకాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తోన్న హీరోల్లో వరుణ్ సందేశ్ కూడా ఒకరు.
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న హీరోల్లో వరుణ్ సందేశ్ (Varun Sandesh) కూడా ఒకరు. 'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి క్లాసిక్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ఇటీవల ఓ ఐదారు చిత్రాలతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చినా అంతగా ఆదరణ దక్కించుకోలేక పోయాయి. ఈ క్రమంలోనే ఆయన మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో సిద్ధమయ్యాడు.
తాజాగా వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా నటించిన చిత్రం 'నా వైఫ్ మిస్సింగ్ (Na Wife Missing). ఆహా ఓటీటీ ఒరిజినల్ (Aha Original) ప్రెజెంటేషన్‌లో రూపొందుతున్న ఈ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ కి స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించింది. ఇక కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వంటి బ్లాక్ బస్టర్ తరువాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu) జంటగా నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులతో సాగింది. కాగా ఈ మూవీ ఆక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవనుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ ఇతర ప్రచార కంటెంట్ జనాలకు చేరవయ్యాయి.