Aasha Review: ఆ క్లైమాక్స్ ఏంట్రా బాబు.. దేవుడా మెంటల్ వచ్చేస్తది

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:12 PM

సీనియర్ నటి ఊర్వశి (Urvashi), జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సఫర్ సనాల్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ఆశ' (Aasha).

Aasha

సీనియర్ నటి ఊర్వశి (Urvashi), జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సఫర్ సనాల్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ఆశ' (Aasha). ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5 లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఒక విభిన్నమైన మానసిక సంఘర్షణ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.


కథ ఏంటంటే.. ఆశ (ఊర్వశి)కు పెళ్ళయిన కొన్నాళ్ళకే భర్త చనిపోతాడు. ఆ తరువాత ఎవరి సహాయం తీసుకోకుండా ధైర్యంగా, ఒంటరిగానే ఇద్దరు కూతుళ్లను పెంచుతుంది. జీవితంలో ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే ఆశ, తన జీవితంలో జరిగిన కొన్ని ఊహించని సంఘటనల వల్ల తీవ్రమైన మెంటల్ ట్రామాలోకి వెళ్ళిపోతుంది.ఒకరోజు రాత్రి తన కూతురు అనఘ (ఐశ్వర్య లక్ష్మి)తో కలిసి సెకండ్ షో సినిమా చూసి కారులో తిరిగి వస్తుండగా, వారి కారును జీమోన్ (జోజు జార్జ్) కారు ఢీకొడుతుంది. ఆ గొడవలో ఆశ అతనిపై పోలీసు కేసు పెడుతుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? తనకున్న తీవ్రమైన అనుమానంతో ఆశ చేసిన అఘాయిత్యం ఏంటి? అనేదే ఈ సినిమా అసలు కథ.


దర్శకుడు సఫర్ సనాల్ ఒక గ్రిప్పింగ్ ప్లాట్‌తో సినిమాను నడిపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా, వేగవంతమైన కథనంతో ప్రేక్షకులను స్క్రీన్‌కి కట్టిపడేస్తుంది. ఆశఏం చేస్తుంది..? తనకున్న భయాలు ఏంటి.. ? అనేది చూపించారు. ఇక ఎప్పుడైతే జీమోన్ ఎంటర్ అవుతాడో కథ మొదలవుతుంది. ముఖాన్ని చూసి, ఎవరిని అంచనా వేయకూడదని డైరెక్టర్ చాలా బాగా చెప్పాడు. ఒక వయస్సు పైబడిన మహిళ.. తన ట్రామాతో ఎలాంటి దారుణానికి ఒడికట్టింది అనేది అద్భుతంగా చూపించారు. ఆ మహిళలో ఒక తల్లి భయం.. కూతుళ్లకు ఏం కాకూడదు అనే ప్రేమని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించని విధంగా ఉండి మనసును మెలిపెట్టేస్తుంది. చివర్లో అందరి మదిలో మెదిలే ప్రశ్న.. పాపం జీమోన్ అని అనిపించకమానదు. ఊర్వశి తన నటనతో సీనియర్ నటిగా మరోసారి జీవించగా, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు ఆశ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

Updated Date - Oct 18 , 2026 | 01:15 PM