OTT: సడన్ సర్‌ఫ్రైజ్.. ఓటీటీకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ
ABN , Publish Date - Aug 07 , 2026 | 07:33 AM
గత నెలలో థియేటర్లకు వచ్చిన తెలుగు చిత్రం ఓ సుకుమారి సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది.
గత నెలలో థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న తెలుగు చిత్రం ఓ సుకుమారి (Oh sukumari). రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఓ విభిన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది. తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) జంటగా నటించగా భరత్ దర్శన్ దర్శకత్వం వహించాడు.
కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకు చెందిన వాడు యాదగిరి (తిరువీర్) ది ఎడ మొహం, పెడ మొహంగా ఉండే ఉమ్మడి కుటుంబం. తాత ఆస్తి కోసం యాదగిరి అనేక ఊర్లు తిరిగి చివరకు దామిని అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే దామినికి పుట్టిన నాటి నుంచే తాను ఎవరిని టచ్ చేసిన వారికి షాక్ కొట్టే ఓ వింత సమస్య ఉంటుంది. దీంతో ఫ్యామిలీతో పాటు ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. కాగా ఈ విషయాన్ని దాచి గుట్టుగా యాదగిరి దామిని పెళ్లి జరిపిస్తారు. కానీ వివాహం జరిగాక అప్పటివరకు హ్యాపీగా ఉన్న ఆ జంట మధ్య విభేదాలు పొడ చూపి చాలా మార్పులు వస్తాయి.
ఈ నేపథ్యంలో ఇంతకు దామిని సమస్యకు పరిష్కారం లభించిందా లేదా కరెంట్ షాక్ సమస్యతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ఆసక్తికరమైన కథ కథనాలతో సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.