తెలుగ‌మ్మాయి.. కొత్త‌ త‌మిళ సినిమా! తెలుగులోనూ.. ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:37 PM

తెలుగ‌మ్మాయి శాన్వీ మేఘ‌న క‌థానాయిక‌గా, ఎలాన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా న‌టిస్తూ తెర‌కెక్కిచ్చిన త‌మిళ‌ చిత్రం ప్యార్ ప్రేమ క‌ళ్యాణం.

Pyaar Prema Kalyanam

తెలుగ‌మ్మాయి శాన్వీ మేఘ‌న (Saanve Megghana) క‌థానాయిక‌గా, ఎలాన్ (Elan) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా న‌టిస్తూ తెర‌కెక్కిచ్చిన త‌మిళ‌ చిత్రం ప్యార్ ప్రేమ క‌ళ్యాణం (Pyaar Prema Kalyanam). డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల కానున్న ఈ చిత్రం త‌మిళంతో పాటు ఏక కాలంలో తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ఆగ‌స్టు 21 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

తాజాగా విడుద‌ల చేసిట్రైల‌ర్ చూస్తే.. ఔట్ అండ్ ఔట్ ఫ‌న్‌, ఫ్యామిలీ క‌థ‌తో రూపొందించ‌న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న సాంప్ర‌దాయం కాద‌ని కొత్త‌గా పెళ్లి చేసుకున్న జంట‌లో అమ్మాయి అత్త‌గారింటికి వెళ్లే బ‌దులు అబ్బాయే అత్త‌గారింటికి ఇల్ల‌రికం వెళ్ల‌డం అక్క‌డ అత‌ను ఎదుర్కొన్న అనుభ‌వాల నేప‌త్యంలో ఈ సినిమా సాగ‌నున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తోంది. మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి.

Updated Date - Aug 13 , 2026 | 06:09 PM