Silent Screams OTT: ఓటీటీలో.. యదార్థ ఘటనల ఫస్ట్ తెలంగాణ క్రైమ్ సిరీస్
ABN , Publish Date - Jan 12 , 2026 | 09:45 AM
తెలంగాణలోని యదార్థ సంఘటనల ఆధారంగా ‘సైలెంట్ స్క్రీమ్స్’ ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ అనే క్రైమ్ సిరీస్ రూపొందింది.
నేరాలు కేవలం పోలీసు రికార్డుల్లో సంఖ్యలుగా మిగిలిపోకూడదు, వాటి వెనుక ఉన్న కన్నీటి గాథలు, కుటుంబాల ఆవేదన బయటకు రావాలనే ఉద్దేశంతో తెలంగాణలోని యదార్థ సంఘటనల ఆధారంగా ‘సైలెంట్ స్క్రీమ్స్’ (Silent Screams) ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (The Lost Girls of Telangana) అనే క్రైమ్ సిరీస్‌ను రూపొందించినట్లు సన్ నెక్స్ట్ (SUN NXT) ఓటీటీ తెలిపింది. స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్ (Shruti haasan) వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సిరీస్‌కు శ్రుతీహాసన్ వాయిస్ బలంగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ‘ఇలాంటి క్రైమ్ సిరీస్‌ను హోస్ట్ చేయడం శ్రుతీహాసన్‌కు ఇదే తొలిసారి. బాధితుల తరపున ఒక గొంతుకగా ఆమె ఈ కథలను ప్రేక్షకులకు వివరిస్తారు. గంభీరమైన గొంతుతో ఆమె కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కేవలం వార్తలుగా గాకుండా, అరికట్టాల్సిన బాధ్యతగా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అని మేకర్స్ చెప్పారు.