ఆ ఓటీటీకి వచ్చిన.. సుమంత్ లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్
ABN , Publish Date - Aug 28 , 2026 | 08:12 AM
అనగనగా వంటి బ్లక్ బస్టర్ తర్వాత సుమంత్ నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం న్యూటన్స్ థర్డ్ లా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
అనగనగా వంటి బ్లక్ బస్టర్ తర్వాత సుమంత్ (Sumanth) నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం న్యూటన్స్ థర్డ్ లా (Newtons 3rd Law). జూలై నెలాఖరున థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. రాజేశ్ కర్ణ (Rajesh karna) దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించగా జగపతిబాబు (Jagapathi Babu), అవసరాల శ్రీనివాస్, త్రినాథ్ వర్మ, రవివర్మ, నేహా పటాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం డిజిట్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే: వినయ్ (త్రినాధ్ వర్మ) ఇంజనీరింగ్ స్టూడెంట్. ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల స్నేహితుడు కార్తిక్‌తో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తాడు. కార్తిక్ ఓ పెద్ద డీల్ తీసుకొస్తాడు.. దాంతో లైఫ్ సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తారు. ఆ పనిలో ఉండగా వీరిద్దరూ వెళ్తున్న కారు జ్యోతి(నేహాపటాన్) అనే మహిళను ఢీ కొట్టగా ఆమె మరణిస్తుంది. ఆ తర్వాత ఓ రోజు వినయ్ అనుమానాస్పదంగా తన అపార్ట్‌మెంట్‌పై నుంచి కింద పడి మరణిస్తాడు. ఆ కేసు వాసుదేవ్ (సుమంత్) చేతికి వస్తుంది. ఇందులో భాగంగా వినయ్ తల్లిదండ్రులైన గంగాధర్, తల్లి పార్వతి లను విచారించగా కొన్ని విషయాలు బయటకొస్తాయి. ఆ నిజాలు ఏంటి? స్నేహితుడి ద్వారా వినయ్‌కు అందిన డీల్ ఏంటి? దానికి మెర్య్కూరీ (జగపతిబాబు) ఉన్న సంబంధం ఏంటి? దీనిలో డేవిడ్ (అవసరాల శ్రీనివాస్) పాత్ర ఏంటి? అతను చదివి భయపడిన ‘న్యూటర్స్ థర్డ్ లా’ బుక్ రాసిందెవరు? వంటి ఆసక్తికర విషయాలకు సమాధానమే ఈ సినిమా.
చర్యకు ప్రతిచర్య అన్న న్యూటర్ ధర్ట్ లా ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. జీవితంలో మన చేసే కర్మ, చర్య.. అది మంచైనా, చెడైనా దానికి ప్రతి చర్య ఉంటుంది.. అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. దీనికి కాస్త సస్పెన్స్ ఎలిమెంట్స్ జోడించి ఓ థ్రిల్లర్ ఎలిమెంట్‌గా మలిచే ప్రయత్నం చేశారు దర్శకుడు రాజేశ్ కర్ణ. ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఇష్టపడే వారు, థియేటర్లలో మిస్సయిన వారు, అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీపై ఓ లుక్ వేయవచ్చు.