Mahendragiri Varahi: సడన్‌గా ఓటీటీకి.. సుమంత్ రీసెంట్ డివైన్ బ్లాక్‌బస్టర్
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:02 AM
గత నెల థియేటర్లకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్న యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది.
గత నెల థియేటర్లకు వచ్చి ఫర్వాలేదనిపించుకున్న యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది. సుమంత్ (Sumanth) హీరోగా వచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి (Meenakshi Goswami) కథానాయికగా నటించగా ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), మాళవికా నాయర్ (Malavika Nair), బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించగా గతంలో సబ్రహ్మణ్య పురం సినిమాను తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి (Santhossh Jagarlapudi) దర్శకత్వం వహించాడు. టిల్లు సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ రోల్‌లో మెరిశాడు. సెప్టెంబర్ 11న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం జనాలను అంతగా థియేటర్లకు రప్పించకపోయినా ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. 200 వందల ఏండ్ల క్రితం మహేంద్రగిరి రాజవంశానికి వారాహి అమ్మవారు పెట్టిన శాపంతో ఆ వంశంలో పుట్టే మగవారు ఎవరూ 33 సంవత్సరాలకు మించి జీవించరు. అయినా అమ్మవారు కరుణ చూపిస్తారనే నమ్మకంతో పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ శాపం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మరో వైపు భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారి ఆట కట్టిస్తూ ఉంటాడు యూ ట్యూబర్ సిద్ధార్థ్ (సుమంత్). అయితే.. ఓ రోజు అతని అన్నయ్య పెళ్లికి ముందు దోష నివారణ కోసం అమ్మవారి గుడికి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతాడు. అదే సమయంలో రాజవంశానికి చెందిన వారసుడు సైతం చనిపోతాడు. ఈ నేపథ్యంలో అమ్మవారంటే తన బక్తులను రక్షించాలి కానీ ఇలా ఎందుకు చంపుతుందంటూ వాటి వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో హీరో అంతుచిక్కని రహాస్యాలను ఛేదించాడా.. ఇంతకు అ శాపం ఎందుకు వచ్చింది, రాజ వంశీకుల మరణాలకు కారణాలేంటి అనేదే కథ.
గతంలో మహేశ్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా తరహా కథతోనే ఈ చిత్రం రూపొందడం విశేషం. సినిమా చివరి వరకు ఉత్కంఠగా నడిపి ట్విస్టులతో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతారు. కానీ ఆలస్యంగా హీరో కేసులోకి రావడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ చిత్రం అమోజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లర్, దైవ భక్తి సినిమాలు ఇష్టపడే వారు ఓకమారు ఈ మూవీని ట్రై చేయవచ్చు.