Nari Nari Naduma Murari OTT: 20 రోజుల‌కే ఓటీటీకి.. శ‌ర్వా నంద్ 'నారీ నారీ న‌డుమ మురారి'

ABN , Publish Date - Feb 02 , 2026 | 10:47 AM

సంక్రాంతికి భారీ సినిమాల పోటీ మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించి ఔరా అనిపించిన నారీ నారీ న‌డుమ మురారి చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

Nari Nari Naduma Murari

శ‌ర్వానంద్ (Sharwanand), సంయుక్త (Samyuktha Menon), సాక్షి వైద్య (Sakshi Vaidya) జంట‌గా రామ్ అబ్బ‌రాజు (Ram Abbaraju) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ న‌డుమ మురారి (Nari Nari Naduma Murari). అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి భారీ సినిమాల పోటీ మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించి ఔరా అనిపించింది. సీనియ‌ర్ న‌రేశ్‌, సిరి హ‌న్మంతు జోడీ కొత్త‌గా ఉండి సినిమా ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు న‌వ్వులు పూయించి మంచి పైసా వ‌సూల్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. అర్కిటెక్ట్ గౌత‌మ్ ఓమారు కేర‌ళ వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డ నిత్య అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఈ విష‌యాన్ని నిత్య అడ్వ‌కేట్ అయిన త‌న తండ్రికి చెబుతుంది.ఆయ‌న మొద‌ట సంశ‌యించినా రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవాల‌ని సూచిస్తాడు. అదే స‌మ‌యంలో భార్య చ‌నిపోయి ఒంటిరిగా జీవితం గ‌డుపుతున్న గౌత‌మ్ తండ్రి కార్తీక్ త‌న కూతురు వ‌య‌సు ఉండే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అంతేగాక ప్ర‌తి నిమిషం తన భార్య‌ను ఇంప్రెస్ చేసేందుకు న‌వ యువ‌కుడిలా అనేక ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలో ఓ రోజు ఒంటిపై టాటూ వేయించుకుంటున్న సంద‌ర్భంలో గౌత‌మ్ అప్ప‌టికే దియా అనే ఓ అమ్మాయిని ప్రేమించ‌డం బ్రేక‌ప్ అయిన‌ట్లు తెలుస్తుంది.

మ‌రోవైపు రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవాల‌ని అందుకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం రిజిస్టేష‌న్‌ ఆఫీసుకు వెళ్ల‌గా అక్క‌డ స‌త్య‌మూర్తి అనే ఆఫీస‌ర్ డ్యూటీలో ఉండ‌డంతో గౌత‌మ్ షాక్ అవుతాడు. గ‌తంలో అత‌ని స‌మ‌క్షంలోనే దియాను మ్యారేజ్ చేసుకున్నాడ‌నే విష‌యం బ‌య‌ట ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో దియా నుంచి విడాకుల ప‌త్రం తెస్తేనే ఈ పెళ్లికి అనుమ‌తిని ఇస్తానంటు మెలిక పెడ‌తాడు. ఈ క్ర‌మంలో గౌత‌మ్ ఏం చేశాడు, దియా, నిత్య‌లకు ఈ విష‌యం తెలిసిందా లేదా దియా విడాకుల‌కు అంగీక‌రించిందా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైర క‌థ‌క‌థ‌నాల‌తో ఫ‌స్ట్ టు లాస్ట్ వ‌ర‌కు సింగిల్ లైన‌ర్స్‌, పంచుల‌తో సెక‌న్ గ్యాప్ ఇవ్వ‌కుండా న‌వ్విస్తూనే ఉంటారు. క్లైమాక్స్‌లో వ‌చ్చే శ్రీ విష్ణు (Sree Vishnu) క్యామియో అన్నింటిని మించి హైలెట్‌. కాగా ఇప్పుడు ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4 (బుధ‌వారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - Feb 02 , 2026 | 12:49 PM