స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన 'కపుల్‌ ఫ్రెండ్లీ'

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:05 AM

సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా రూపొంది, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు రీచ్ కాలేక పోయిన చిత్రం 'కపుల్‌ ఫ్రెండ్లీ’.

Couple Friendly

సంతోష్‌ శోభన్‌ (Santosh Sobhan), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా రూపొందిన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం గ‌త నెల‌లో థియేట‌ర్ల‌లో విడుదలైంది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రీచ్ కాలేక పోయింది. ప్ర‌భాస్ (Prabhas) అంత‌టి స్టార్ రంగంలోకి దిగిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితం ల‌భించ‌లేదు. అశ్విన్‌ చంద్రశేఖర్ (Ashwin Chandrasekar) దర్శకత్వంలో యు.వి. కాన్సెప్ట్స్ (UV Concepts) నిర్మించిన ఈ చిత్రం స‌డ‌న్‌గా ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

కథ విష‌యానికి వ‌స్తే.. శివ ఓ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్. అతనికి ఉద్యోగం దొర‌క్క ఖాళీగా తిరుగుతుంటాడు. ఇంట్లో ఒత్తిడి భ‌రించ‌లేక చెన్నై వెళ్లి జాబ్ ప్ర‌య‌త్నాల్లో ఉంటారు. అదే స‌మ‌యంలో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చెన్నై వ‌చ్చిన మిత్ర ఓ రోజు అనుకొని సంఘ‌ట‌న‌లో శివ‌ను కలుస్తుంది. వీరిద్దరూ క‌లిసి ఆమెకు హ‌స్ట‌ల్ కోసం వెతుకుతారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో శివ రూమ్‌లోనే పెయింగ్‌ గెస్ట్‌గా మిత్ర ఉంటుంది. ఆపై క్ర‌మంగా వారిరువురు వారి వారి ఉద్యోగాల్లో బిజీ కావ‌డం ఆ తర్వాత పీక‌ల్లోతు ప్రేమ‌లో పడటం జరుగుతుంది. అంతా మంచిగా ఉంద‌నుకుంటున్న స‌మ‌యంలో వారి జీవితంలో తీవ్ర‌మైన కుదుపు వ‌స్తుంది. మిత్ర‌కు ఓ సమస్య రావ‌డంతో విడిపోవాల్సి వ‌స్తుంది. చివ‌ర‌కు ఇరువురు ఒక‌ట‌య్యారా, వీరి ప్రేమ క‌థ ఏ తీరానికి చేరింద‌నేది ఈ మూవీ స్టోరి.

ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న లివిన్ రిలేష‌న్ షిప్స్‌, ప్రేమ‌లు, బాధ్య‌త‌లు తదిత‌ర అంశాల‌ను ట‌చ్ చేస్తూ సినిమా సాగుతుంది. ఫ‌స్ట్ హాఫ్ అంతా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతూ సెకండ్ పార్ట్ అంతా ఫుల్ ఎమోష‌నల్ రైడ్ తో సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు త‌మిళ, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, ల‌వ‌ర్స్ ఈ సినిమాను హ్యాపీగా చూసేయ‌వ‌చ్చు. అయితే.. 'కపుల్‌ ఫ్రెండ్లీ’ (Couple Friendly) సినిమాలో మ‌ధ్య‌లో కొన్ని ముద్దు, ఇంటిమేట్ స‌న్నివేశాలు ఉన్నందున పిల్ల‌ల‌ను దూరంగా ఉంచ‌డం మంచిది.

Updated Date - Mar 13 , 2026 | 11:41 AM