Jigris OTT: ఓటీటీలో.. దూసుకెళుతున్న జిగ్రీస్‌! ఇప్పుడు.. అమెజాన్ ప్రైమ్ లో

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:13 PM

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌కు వచ్చి డీసెంట్ విజయం అందుకున్న చిత్రం జిగ్రీస్ మూవీ ఇప్పుడు మ‌రో ఓటీటీలోకి వ‌చ్చేసింది.

Jigris

రెండు నెల‌ల క్రితం థియేట‌ర్ల‌లోకి వచ్చి డీసెంట్ విజయం అందుకున్న చిత్రం జిగ్రీస్(Jigris). యానిమ‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా స‌పోర్ట్‌తో ఆయ‌న‌ స్నేహితులు తెర‌కెక్కించిన ఈ చిత్రం న‌వంబ‌ర్‌14న విడుద‌లైంది. మ్యాడ్ ఫేం రామ్ నితిన్ (Ram Nithin), కృష్ణ బురుగుల (Krishna Burugula), మణి వక (Mani Vaka), ధీరజ్ ఆత్రేయ (Dheeraj Athreya) కీలక పాత్రల్లో నటించ‌గా హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula) దర్శకత్వం వహించాడు. రెండు రోజుల క్రితం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన చిత్రం మంచి వ్యూస్‌తో దూసుకెళుతుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. కార్తిక్, ప్రవీణ్‌, వినయ్, ప్రశాంత్ అనే నలుగురు స్నేహితులు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి మెలిసి ఉంటారు. న‌లుగురు నాలుగు ర‌కాల మ‌న‌స్థ‌త్వాల‌తో ఉంటారు. అయితే.. ఆపై కాలేజీలు, ఉన్న‌త చ‌దువుల నేప‌థ్యంలో వారి న‌డుమ‌ గ్యాప్ వ‌స్తుంది. వీరిలో ప్ర‌శాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య ఉంద‌ని తెలుసుకున్న మిత్రులు ఓ రోజు రాత్రి తాగిన మ‌త్తులో హ‌డావుడిగా పాత మారుతి 800 కారులో గోవా ట్రిప్ బ‌య‌లుదేరుతారు.

Jigris

కానీ త‌మ వ‌ద్ద ఉన్న ఫొన్లు, ప‌ర్సులు అన్ని అక్క‌డే మ‌రిచి పోతారు. కొంత దూరం వెళ్లాక కారు ట్ర‌బుల్ ఇవ్వ‌డంతో వారి ష్లాన్ అంతా త‌ల‌కిందులవుతుంది. అప్పుడే వ‌చ్చిన‌ మెకానిక్‌ ఎంట్రీతో క‌థ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. చివరకు వారు గోవా చేరుకున్నారా.. లేదా? ఆ కారులోనే ఎందుకు వెళ్లారు. మెకానిక్ తో వ‌చ్చిన త‌ల‌నొప్పులు ఏంటి, ఆ ప్రయాణం ఎలాంటి మార్పులు తీసుకువచ్చింద‌నేది మిగిలిన కథ.

ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురైదుగురు మిత్ర‌ల నేప‌థ్యంలో అనేక సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ చిత్రం వాటికి భిన్నంగా తెర‌కెక్కింది. కేవ‌లం న‌వ్వులే కాకుండా గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా వీక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. ముఖ్యంగా కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించి సినిమాకే మైలెట్‌గా నిలిచాడు. ఇప్ప‌టికే సన్ నెక్స్ట్ (SunNXT)లో స్టీమింగ్ అవుతూ మంచి ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime) ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, మంచి ఫ‌న్‌, ఎమోష‌న‌ల్ డ్రామా చూడాల‌నుకునే వారు ఈ సినిమా బెస్ట్ ఆప్స‌న్. అస‌లు వ‌ద‌ల‌కండి. పాట‌లు సైతం అర్థ‌వంతంగా మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఉంటాయి.

Updated Date - Jan 09 , 2026 | 01:31 PM