ఈసారి అంతకుమించి.. ప్రియాంకా చోప్రా సిటాడెల్ సీజన్2 ట్రైలర్
ABN , Publish Date - Apr 22 , 2026 | 08:21 AM
మూడేళ్ళ క్రితం వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన అమెరికన్ స్పై యాక్షన్ టెలివిజన్ సిరీస్ సిటాడెల్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది.
మూడేళ్ళ క్రితం వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన అమెరికన్ స్పై యాక్షన్ టెలివిజన్ సిరీస్ సిటాడెల్ (Citadel). ప్రియాంకా చోప్రా (Priyanka Chopra), రిచర్డ్ మాడెన్ (Richard Madden), స్టాన్లీ టుచీ (Stanley Tucci), లెస్లీ మాన్విల్లే (Lesley Manville) లీడ్ రోల్స్‌లో నటించారు. ఇప్పుడు ఈ సిరీస్‌లో రెండో సీజన్ రిలీజ్‌కు సిద్ధమైంది. 300 మిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో రస్సో బ్రదర్స్ (Russo brothers) ఈ సిరీస్‌ను నిర్మించారు. జో రస్సో (Joe Russo) దర్వకత్వం వహించాడు. మంగళవారం రాత్రి ఈ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. మే6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది.
తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే తొలి సీజన్‌ను మరిపించేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, జిగేల్‌మనిపించే విజువల్స్‌తో ఈ సీజన్‌ను రూపొందించినట్టు అర్థమవుతోంది. బెర్నాడ్ టీంను ఓ స్పై నెట్‌వర్క్ దారుణంగా అంతమొందించడంతో అక్కడి నుంచి తప్పించుకున్న బెర్నాడ్ తన పాత టీంను రంగంలోకి దింపి కొత్తగా మరో ఆపరేషన్ చేపడుతాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే పాయింట్‌తో ఈ సీజన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి మరి.