Peddi OTT: అప్పుడే.. ఓటీటీకి 'పెద్ది'! ఎప్పటి నుంచంటే?
ABN , Publish Date - Jun 22 , 2026 | 07:26 PM
ఈ నెల ఆరంభంలో థియేటర్లకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకున్న పెద్ది చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సన్నద్ధమవుతోంది.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor), శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతిబాబు (Jagapathi Babu), బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ (Divyenndu) కీలక పాత్రల్లో నటించిన చిత్రం పెద్ది (Peddi,). ఈ నెల జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్సతో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మించింది. మూవీ విడుదలైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం జాన్వీ పాత్ర విషయంలో మాత్రం పూర్తి నెగిటివిటీతో ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది. ఆపై తేరుకున్న చిత్ర బృందం జాన్వీకి సంబంధించిన సన్నివేశాలను రీ ఎడిట్ చేయడంతో అదనంగా కొత్త సీన్లను సైతం జత చేశారు. అయితే.. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సన్నద్ధమవుతోంది.
కథ విషయానికి వస్తే.. 1990లలో విజయనగరానికి సమీపంలోని ఎత్తైన పర్వతాల నడుమ నివసించే ప్రజలు ఎలాంటి గుర్తింపు లేకుండా, సరైన రవాణా సౌకర్యం కూడా లేకుండా కొన్నేండ్లుగా జీవిస్తుంటారు. ఈ క్రమంలో క్రికెట్‌లో నైపుణ్యం ఉన్నపెద్ది కూలీ కోసం అక్కడి డబ్బున వారి సమక్షంలో ఆడి వారికి పేరు తీసుకు వస్తాడు. అయితే అప్పల సూరి చేసిన త్యాగం చూసిన పెద్ది క్రికెట్‌ను శాశ్వతంగా వదిలి కుస్తీ పోటీలోకి దిగుతాడు. ఎలాగైనా తన ఊరికి, అక్కడి ప్రజలకు ఓ గుర్తింపును సంపాదించాలని డిసైడ్ అవుతాడు. కానీ ఓ సందర్భంలో పెద్ది క్రికెట్‌ను కూడా వదిలి వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు పెద్ది ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకు్ననాడు. చివరకు తన ఊరి ప్రజలకు గుర్తింపు, రవాణా సౌకర్యం తీసుకు వచ్చాడా లేదా అనేది కథ.
చదవడానికి, చూడడానికి ఇది తెలిసిన కథే అయినా దర్శకుడు పెద్ది సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎన్నడు చూడని విధంగా కొత్త అవతార్‌లో కనిపించి ప్రేక్షకులకు, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. కూలీగా, క్రికెట్ ప్లేయర్‌గా, కుస్తీ పోటీల్లో చరణ్ చూపించిన ట్రాన్స్‌ఫర్మేషన్ మెస్మరైజ్ చేస్తుంది. సినిమా ముగిసిన తర్వాత కూడా చరణ్ సినిమా కోసం పడిన కష్టం గురించి అంతా మాట్లాడుకోకుండా ఉండలేరు. ఇదిలాఉంటే ఇప్పటికే పెద్ది విడుదలై మూడు వారాల గడుస్తున్నా థియేటర్ల వద్ద మంచి వసూళ్లనే రాబడుతుంది. అయినప్పటికీ ఇప్పుడీ చిత్రం జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవబోతుంది. థియేటర్లలో చూడలేక పోతున్నవారు , అల్రెడీ చూసిన వారికి ఇది మంచి అవకాశం.