‘హాట్ స్పాట్ 2 మచ్’.. ఓటీటీకి వ‌చ్చేసింది

ABN , Publish Date - Feb 27 , 2026 | 08:23 PM

రెండేండ్ల క్రితం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న చిత్రం హాట్ స్పాట్ సీక్వెల్‌గా రూపొందిన‌ ‘హాట్ స్పాట్ 2 మచ్’ తాజాగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

hotspot

రెండేండ్ల క్రితం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న చిత్రం హాట్ స్పాట్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన‌ ‘హాట్ స్పాట్ 2 మచ్’ (Hot Spot 2 Much) తాజాగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది. ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar), సీనియర్ నటులు ఎం.ఎస్. భాస్కర్ (M. S. Bhaskar), తంబి రామయ్య (Thambi Ramaiah), యువ నటుడు అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్ ముఖ్య పాత్రల్లో న‌టించారు. మోజ్విత్–మోవిహాన్ సమర్పణలో అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. విఘ్నేశ్ కార్తీక్ (Vignesh Karthick )ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

HB7GnYRbEAAZWkv.jfif

ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రిగిన‌, జ‌రుగుతున్న స‌మ‌కాలీన అంశాల‌ను క‌థా వ‌స్తువుగా చేసుకున్నారు. నేటి సామాజిక పరిస్థితులు, మనుషుల మధ్య సంబంధాలు, ఆలోచనల్లో మార్పులు వంటి విషయాలను వినోదాత్మకంగా తెర‌కెక్కించారు. కొన్ని స‌న్నివేశాల్లో కాస్త రొమాంటిక్ సన్నివేశాలతో క‌వ్వించే ప్ర‌య‌త్నం కూడా చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఆహా (Aha) ఓటీటీలో ఈ రోజు (శుక్ర‌వారం, ఫిబ్ర‌వ‌రి 27) నుంచి ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే త‌మిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవ‌డం విశేషం.

Updated Date - Feb 27 , 2026 | 11:18 PM