The Raja Saab OTT: ప్ర‌భాస్‌.. ది రాజాసాబ్ ఓటీటీకి వ‌చ్చేశాడు

ABN , Publish Date - Feb 06 , 2026 | 05:45 AM

ఎన్నో అంచ‌నాల న‌డుమ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి నిరాశ‌ ప‌ర్చిన చిత్రం ప్ర‌భాస్ (Prabhas) ది రాజాసాబ్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

The Raja Saab

ఎన్నో అంచ‌నాల న‌డుమ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి నిరాశ‌ ప‌ర్చిన చిత్రం ప్ర‌భాస్ (Prabhas) ది రాజాసాబ్ (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించిన ఈ చిత్రానికి మారుతి (Maruthi) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నిధి ఆగ‌ర్వాల్ (Nidhh iAgerwal), మాళ‌విక మోహ‌న‌న్ (Malavika Mohanan), రిద్ది కుమార్ (Ridhi kumar) క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమా శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. నాన‌మ్మ అంటే తెగ ఇష్టం ఉన్న రాజా ఆ మె కోసం ఏ ప‌నైనా ఎంత వ‌ర‌కైనా వెళుతుంటాడు. అయితే చాన్నాళ్ల క్రిత‌మే ఇంటి నుంచి వెళ్లిపోయిన తాత గురించి త‌లుచుకుంటూ బాధ ప‌డుతూ ఉంటుంది. అంతేగాక వృద్దాప్యం వ‌చ్చినా ఇంకా ఆయ‌న గురించి వెతుకుతూనే ఉంటారు. ఈ క్ర‌మంలో ఓ సంద‌ర్భంలో ఆయ‌న ఆన‌వాల్లు క‌నిపించ‌డంతో ఆయ‌న‌ను వెతుకుతూ వెళ‌తారు. ఈక్ర‌మంలో ఓ పెద్ద పాడుబ‌డిన బంగ్లాకు చేరుకుంటాడు. తీరా అక్క‌డికి వెళ్లాక అస‌లు తాత ఎప్పుడో చ‌నిపోయాడ‌ని, దెయ్యంగా మారి త‌న‌ని ఇక్క‌డికి తీసుకు వ‌చ్చాడ‌ని మ‌నుమ‌డికి తెలుస్తోంది. అంతేగాక నాన్న‌మ్మ గ‌తంలో ఓ సంస్థానం యువ‌రాణి అని త‌న‌ను తాత క్ష‌ద్ర‌పూజ‌లతో వ‌శ‌ ప‌రుచుకుని పెళ్లి చేసుకుని ఆ డ‌బ్బుతో పారిపోయి ఆక్ర‌మంలో చ‌నిపోయాడ‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో అస‌లు చ‌నిపోయిన తాత తిరిగి ద‌య్యంగా ఎందుకు మారాడు త‌న మ‌నుమ‌డు, భార్య‌ను ఎందుకు ఆ పాడుబ‌డ్డ బండ్లాకు వ‌చ్చేలా చేశాడు, అప్పుడు కూడా ఎలా వారి మైండ్‌ను కంట్రోల్‌లో ఉంచుకోగ‌లిగాడు, రాజా సాబ్ అండ్ టీం ఎలా బ‌య‌ట ప‌డ‌గ‌లిగింది అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ చాలా భిన్న‌మైంది కావ‌డం, ప్ర‌జెంట్ చేయ‌డంలో త‌డ‌బ‌డ‌డంతో ప్రేక్ష‌కుల‌కు అంత‌గా ఎక్క‌లేదు గానీ రెండు మూడు సార్లు చ‌స్తేగానీ అర్థం కాదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎక్స్‌టెండెండ్ క‌ట్‌తో మూడు గంట‌ల నిడివితో జీయో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చారు.

 The Raja Saab

థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌ప్ప‌క చూడాల్సిన మూవీ ఇది. అయితే.. ఫ‌స్టాప్ అంతా సోసోగా సాగి కాస్త విసుగు తెప్పించినా.. సెకండాఫ్ అంతా ద‌య్యం బంగ్లా కేంద్రంగానే న‌డిచి అస‌లు సినిమా స్టార్ట్ అవుతుంది. కాకాపోతే సినిమాకు ముగ్గురు కాదు క‌దా ఓక్క‌రు కూడా హీరోయిన్ అవ‌స‌రం లేద‌ని అనిపిస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది కాబ‌ట్టి యాడ్స్‌తో ఇబ్బందిని మాత్రం ఫేస్ చేయాల్సిందే. ప్ర‌తి 5, 10 నిమిషాల‌కు ఒక‌సారి నిమిషంకు పైగా ప్ర‌క‌ట‌న‌ల‌తో సుమారు అర్థ‌గంట‌కు పైగా స‌మ‌యం ఆ ఆడ్వ‌ర్టైజ్ మెంట్ల‌తోనే పోవ‌డం మాత్రం గ్యారంటీ.

Updated Date - Feb 06 , 2026 | 06:55 AM