Peddi: పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ అంటే..
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:52 PM
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’ (Peddi). స్పోర్ట్స్ డ్రామాగా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
రామ్ చరణ్(Peddi), జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’ (Peddi). స్పోర్ట్స్ డ్రామాగా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జులై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. హిందీలో స్ట్రీమింగ్ ఇంకాస్త సమయం ఉన్నట్లు తెలిసింది.
కథ..
విజయనగరంలో ఓ అటవీ ప్రాంతంలోని పల్లె అది. కొండ కింద అని పిలుస్తారు. దానికి ఏ గుర్తింపు, కనీస రవాణా సౌకర్యం కూడా ఉండదు. ఆ కొండ మీదుగా ఓ రైలు వెళ్తుంది. కానీ ఆ ప్రాంతంలో స్టేషన్ లేకపోవడంతో రైలు అక్కడ ఆగదు. 1800 జనాభా గల ఈ ప్రాంతవాసులు కాలి నడకనే విజయనగరం వలస వెళ్లి పని చేసుకుని బతుకుతారు. ఆ కొండ కింద ఉండే వ్యక్తి ‘పెద్ది’ (రామ్ చరణ్). క్రికెట్ అంటే పిచ్చి. మంచి ఆటగాడు కూడా. ఆట కూలీగా అతన్ని ఓ జట్టు పాడుకుని క్రికెట్ ఆట ఆడించి గెలిచి పేరు తెచ్చుకుంటారు. అదే టీమ్ పెద్దిని ఓసారి అవమానిస్తుంది. అందుకు కారణమేంటి? ఆట కూలీగా క్రికెట్ ఆడే పెద్ది కుస్తీ వైపు, ఆ తర్వాత రన్నింగ్ వైపు ఎందుకు వెళ్లాడు. అతను ఉంటే కొండ కింద ప్రాంతానికి భారత దేశంలో గుర్తింపు తీసుకురావడానికి ఏం చేశాడు? ఈ జర్నీలో పెద్దికి, అప్పల సూరికి ఉన్న సంబంధం ఏంటి? పెద్దింటి అమ్మాయి అయిన అచ్చియ్యమ్మ పెద్దిని ఇష్టపడటానికి కారణం ఏంటి? వారి ప్రేమ సుఖాంతం అయిందా? అన్నది కథ.