‘పేట్రియాట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ వివరాలివే!
ABN , Publish Date - May 22 , 2026 | 08:20 PM
దాదాపు 18 ఏళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘పేట్రియాట్’. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
దాదాపు 18 ఏళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి (Mammootty), మోహన్ లాల్ (Mohanlal) కలిసి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం ‘పేట్రియాట్’ (Patriot). మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, ఫహాద్ ఫాజిల్, కున్‌చాకో బొబన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. మంచి సక్సెస్‌నే అందుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన వివరాలను, రైట్స్ సొంతం చేసుకున్న జీ5 (Zee5) సంస్థ ప్రకటించింది.
‘పేట్రియాట్’ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జీ5 ఓటీటీ వేదికగా జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుందని, సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గూఢచర్యం, రాజకీయాలు, టెక్నాలజీ, భావోద్వేగాలు, నాటకీయతలను కలిపి రూపొందించిన ఈ సినిమాలో.. అధికారం ఆధారంగా నడిచే వ్యవస్థలో నియంత్రణలేని నిఘా ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించారు. కథలో ప్రధాన పాత్రధారి దేశ భద్రత కోసం ఒక అత్యాధునిక ప్రభుత్వ నిఘా వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఆ నిఘా వ్యవస్థను రూపొందించిన వ్యక్తే.. దానికి ఎదురెళతాడు. తను ఎందుకలా చేశాడు? అతను చేసింది దేశద్రోహమా? లేక, నిజమైన దేశభక్తికి అర్థమా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ మూవీ ఓటీటీ విడుదలను పురస్కరించుకుని దర్శకుడు మహేష్ నారాయణన్ మాట్లాడుతూ... ‘పేట్రియాట్’ మూవీ మనం ప్రస్తుత అనుభవిస్తున్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. ప్రజలను రక్షించడానికి రూపొందించిన టెక్నాలజీనే చివరకు భయం, నియంత్రణకు ఆయుధంగా మారే పరిస్థితులను ఈ సినిమాలో చూపించాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ జీ5లో ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుతున్నానని అన్నారు. జూన్ 5న జీ5 ఓటీటీలోకి వస్తోన్న ఈ మూవీని చూసి అంతా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నట్లుగా మమ్ముట్టి, మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?
Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!