‘లస్ట్ స్టోరీస్ 3’.. ట్రైలర్ వచ్చేసింది
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:47 PM
నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లకు కొనసాగింపుగా ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ప్రేక్షకుల ముందుకు రానుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లకు కొనసాగింపుగా ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్ 3’ (Lust Stories 3) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, ఆకర్షణ, కోరికలు, మానవ సంబంధాల చుట్టూ తిరిగే కొత్త కథలతో ఈ ఆంథాలజీ మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఈ సిరీస్‌లో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాలుగు విభిన్న కథల సమాహారంగా రూపొందిన ఈ ఆంథాలజీకి విక్రమాదిత్య మొత్వానే, కిరణ్ రావు, శకున్ బత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు.
ప్రతి కథ ప్రత్యేకమైన నేపథ్యం, పాత్రలు, భావోద్వేగాలతో రూపొందినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఆధునిక సంబంధాల్లో దాగి ఉన్న సంక్లిష్ట భావాలను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు. ముఖ్యంగా ట్రైలర్‌లో ఎక్కడా అతిగా రొమాంటిక్ సన్నివేశాలు చూపించకుండా, కథలపై ఆసక్తిని పెంచే విధంగా కట్ చేయడం ఆకట్టుకుంటోంది. లోపల బోల్డ్ కంటెంట్‌కు కొదవ ఉండదనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.వైవిధ్యమైన కథనాలు, బలమైన నటీనటుల బృందంతో వస్తున్న ‘లస్ట్ స్టోరీస్ 3’ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకులను మరోసారి ఈ ఫ్రాంచైజీ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.