Kalamkaval OTT: ఓటీటీకి మ‌తి పొగొట్టే.. మ‌మ్ముట్టి లేటెస్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌! స్ట్రీమింగ్‌.. ఎప్ప‌టి నుంచంటే

ABN , Publish Date - Jan 09 , 2026 | 07:57 PM

ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల మ‌తి పొగొట్టిన‌ మ‌మ్ముట్టి లేటెస్ట్ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ఎట్ట‌కేల‌కు స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది.

Kalamkaval

మ‌మ్ముట్టి (Mammootty) లీడ్ రోల్‌లో జైల‌ర్ వినాయకన్ (Vinayakan), గిబిన్ గోపీనాథ్ కీల‌క పాత్ర‌ల్లో గాయత్రి అరుణ్, రజిషా విజయన్, శ్రుతి రామచంద్రన్ సహాయక పాత్రల్లో న‌టించిన లేటెస్ట్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం కలాంకావల్ (Kalamkaval). జితిన్ కె. జోస్ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తూ రూపొందించిన ఈ మూవీ డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన ఈ చిత్రం అద్భుత విజ‌యం సాధించింది. కేర‌ళ‌లో నిజంగా జ‌రిగిన య‌ధార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెర‌కెక్కించారు. అయితే.. చాలామంది ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వ‌స్తుందా అని క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంద‌రి నిరీక్ష‌ణ‌ల‌కు తెర‌దించుతూ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేందుకు స్ట్రీమింగ్ డేట్‌తో సిద్ద‌మైంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. త‌మిళ‌నాడు, కేర‌ళ స‌రిహ‌ద్దుల్లోని ఓ ప్రాంతంలో ఓ యువ‌తి మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేడానికి జ‌య‌కృష్ణ‌న్ అనే ఎస్సై రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ప‌రిశోధిస్తున్న స‌మ‌యంలో స‌మీప గ్రామాల్లో అఇంకా అనేక మంది మ‌హిళ‌లు మిస్ట‌రీగా మాయ‌మైన విష‌యం వెలుగులోకి వ‌స్తుంది. అంతేగాక ఒక‌టి కేర‌ళ‌లో జ‌రిగితే ఆ వెంట‌నే మ‌రోటి త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌డంతో పాటు మిస్ అయిన వారి ఫోన్ల నుంచే త‌ర్వాతి బాధ‌ఙ‌తుల‌కు ఫోన్లు సైతం వెళ్లిన‌ట్లు క‌నిపెడ‌తారు. ఈ క్ర‌మంలో స్టాన్లీ దాస్ అనే మ‌రో పోలీస్‌ను సాయంగా తీసుకుంటారు. కానీ దొరికిన ప్ర‌తీ లీడ్ ప‌రిష్కారం దొర‌క్క ఇబ్బంది ప‌డుతుంటారు. చివ‌ర‌కు పోలీసులు నేర‌స్తుడిని ప‌ట్టుకో గ‌లిగారా లేదా.. ఇంత‌కు అ హంత‌కుడు ఎవ‌ర‌నేది చూసే వారికి ఫ్యూజులు ఎగ‌ర‌గొడుతుంది.

Kalamkaval

ఇలాంటి త‌ర‌హా స‌నిమాలు ఇ్ప‌టివ‌ర‌కు మ‌నం అనేకం చూసిన‌ప్ప‌టికీ ఈ చిత్రం మాత్రం అందుకు విభిన్నంగా న‌డుస్తూ చూసే ప్రేక్ష‌కుల‌కు మంచి థ్రిల్ అందిస్తుంది. మ‌మ్ముట్టి స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రంలో జైల‌ర్ వినాయ‌క‌న్‌ను గ‌తంలో చూడ‌ని పాత్ర‌లో క‌నిపించి స‌ర్‌ఫ్రైజ్ చేస్తాడు. ఇప్పుడీ సినిమా సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సోనీ లివ్ (Sony LIV) ఓటీటీలో జ‌న‌వ‌రి 16 నుంచి మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. మ‌మ్ముట్టి సినిమాలు ముఖ్యంగా సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డే వారు త‌ప్ప‌క చూడాల్సిన సినిమా ఇది. సినిమా చూశాక ప్ర‌తి ఒక్క‌రూ మ‌మ్ముట్టికి మాత్రం చేతులెత్తి దండం పెట్ట‌క‌ ఉండ‌లేరు. అంత‌గా ఆయ‌న హ‌వాభావాల‌తో, చూపులతోనే యాక్ట్ చేసి మెస్మ‌రైజ్ చేస్తాడు.

Updated Date - Jan 09 , 2026 | 08:36 PM