ఓటీటీకి మెంటలెక్కించే.. సైకలాజికల్ థ్రిల్లర్!
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:41 AM
గత నెలలో థియేటర్లకు వచ్చి సెలబ్రిటీల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మలయాళ చిత్రం బాలన్ ది బాయ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
గత నెల జూన్ 19న అనామక చిత్రంగా థియేటర్లకు వచ్చి సెలబ్రిటీల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మలయాళ చిత్రం బాలన్ ది బాయ్ (Balan The Boy). ఆదిశేషన్ కె. ఆర్ (Adhisheshan K. R), ఫర్జానా పాలతింగల్ (Farzana Palathingal), ముహమ్మద్ జినాన్ కీలక పాత్రల్లో నటించగా మంజుమ్మల్ బాయ్స్ వంటి సెన్షేనల్ చిత్రాన్ని తెరకెక్కించిన చిదంబరం (Chidambaram) దర్శకత్వం వహిచాడు. అంతేగాక మలయాళ బ్లాక్ బస్టర్స్ రోమాంచం, ఆవేశం సినిమాలకు రపని చేసిన జీతూ మాధవన్ (Jithu Madhavan) ఈ సినిమాకు రచయిత కావడం మరో విశేషం. అలాంటి ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
కథ విషయానికి వస్తే.. మోసం చేసిన భర్తను చంపి జైలుకు వెళ్లి వచ్చిన ఓ మహిళ తన కుమారుడితో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆపై రకరకాల పనులు చేస్తూ తన గుర్తింపు ఎక్కడా బయటకు రాకుండా లైఫ్ లీడ్ చేస్తూ, కొత్త కొత్త పేర్లతోవివిధ ప్రాంతాలలో ఉంటుంటారు. తన బిడ్డను తప్పా మరెవరిని నమ్మకూడదని, తనకు కుమారుడికి నడుమ మరెవరు ఉండకూడదని గిరి గీసుకుని జీవిస్తుంటుంది. అందుకని మరో పెళ్లి కూడా చేసుకోకుండా కేరళలో ఒంటరిగా ఉంటున్న ఓ పెద్దావిడకు కేర్ టేకర్‌గా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కుమారుడు తప్పిపోయి తల్లిని వెతుక్కుంటే పాత నివాసాలకు వెళ్లి చివరకు పోలీసుల చెంతకు చేరుతాడు. దీంతో కథ మరో టర్న్ తీసుకుంటుంది. అసలు తల్లి ఎందుకు రహాస్యంగా జీవిస్తుంది, పిల్లాడు పోలీసులను కలిశాక ఏం జరిగింది ఇంతకు తల్లీ బిడ్డ మరలా కలుసుకున్నారా లేదా అనేది కధ.
చదవడానికి, వినడానికి ఈ కథ సింపుల్‌గా ఉన్నప్పటికీ ప్రతి క్షణం ఉత్కంట కలిగించేలా, ఏదో జరగబోతుందనేలా దర్శకుడు గ్రిప్పింగ్‌గా స్టోరీని నడిపించాడు. కొన్ని సన్నివేశాలైతే ఉహకంని విధంగా ఉంటాయి. స్టార్ హీరో టొవినో థామస్ కాసేపు కనిపించి అలరిస్తాడు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం జూలై 31 నుంచి జీ5 (Zee5) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్సయిన వారు, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఇది.