స‌డ‌న్‌గా.. ఓటీటీకి జ‌గ‌ప‌తిబాబు లేటెస్ట్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Aug 14 , 2026 | 10:19 AM

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం వ‌ద‌లా స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసింది.

Vadala

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం వ‌ద‌లా (Vadala). జ‌గ‌ప‌తి బాబు (JagapathiBabu), ల‌య (Laya), హృతిక శ్రీనివాస్ (Hrithika), శ్రీనివాస్ అవ‌స‌రాల‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా ఆకెళ్ల‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాక్ ఇచ్చింది.

క‌థ‌విష‌యానికి వ‌స్తే.. డాక్ట‌ర్ అయిన యోగి సిద్ధార్థ్ మ‌ధ్య ప్ర‌దేశ్‌లో త‌న ఫ్యామిలీతో క‌లిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంటాడు. అంతా స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో అనుకోకుండా ఓ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ అముద వారి కుటంబానికి చేరువ అవుతుంది. కానీ అప్ప‌టి నుంచి వారి ఫ్యామిలీలో ప్ర‌శాంత‌త క‌రువ‌వుతుంది.

Vadala

అనుకోని ఘ‌ట‌న‌లు జ‌రుగుతూ కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంత‌కు ఆ ఫ్యామిలీలో ఉన్న‌ట్టుండి ఏమి జ‌రిగింది, అముద నేప‌థ్యం ఏమిటి, ఆ కుటుంబంలోకి ఎందుకు వ‌చ్చింది చివ‌ర‌కు ఆ ఫ్యామిలీ ఏమైందనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

చ‌ద‌వ‌డానికి, చూడ‌డానికి మ‌నం ఇప్ప‌టికూ చూసిన వంద‌ల కొద్ది సినిమాల మాదిరిగానే ఈ మూవీ సాగిన‌ప్ప‌టికీ ఓ విభిన్న‌మైన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo) ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చింది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, జ‌గ‌ప‌తి బాబు ఫ్యాన్స్, డిఫ‌రెంట్ సినిమాలు ఇష్ట‌ప‌డేవారు ఒక‌మారు ఈ సినిమా చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Aug 14 , 2026 | 10:19 AM