Anaconda OTT: కొత్త అనకొండ.. ఓటీటీకి వచ్చేసింది!
ABN , Publish Date - Jan 28 , 2026 | 09:54 AM
కాస్త గ్యాప్ తర్వాత ఓ హాలీవుడ్ యాక్షన్ అడ్వంచర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కాస్త గ్యాప్ తర్వాత ఓ హాలీవుడ్ యాక్షన్ అడ్వంచర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత నెల డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి నవ్వులు పూయించి విజయం సాధించిన అనకొండ (Anaconda) ఇప్పుడు సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. సుమారు రూ.869 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం రూ.1171 కోట్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 2004లో చివరి చిత్రం రాగా తిరిగి 21 ఏండ్ల తర్వాత ఈ మూవీ వచ్చింది.
కథ విషయానికి వస్తే.. మాములుగా ఇప్పటివరకు వచ్చిన అనకొండ చిత్రాల మాదిరి కాకుండా ఇది పూర్తి భిన్నంగా తెరకెక్కింది. డాగ్ (జాక్ బ్లాక్), గ్రిఫ్ (పాల్ రుడ్) చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. అయితే.. వారికి తమ లైఫ్‌లో ఎలాగైనా అమెజాన్ అడవుల్లోకి వెళ్లి ఒరిజినల్ అనకొండతో సినిమా తీయాలని వెళతారు. అక్కడ ఎంత ట్రై చేసిన అనకొండ జాడ కనబడక తిరిగి వెనుతిరుగుతున్న సమయంలో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి వారి వెంట పడుతుంది. ఈ నేపథ్యంలో వారు అనుకున్నట్లు అక్కడ సినిమా తీయగలిగారా లేదా, వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనేది కథ.
ఔట్ అండ్ ఔట్ కామెడీగా రూపొందించిన ఈ మూవీలో మధ్యలో వచ్చే అడ్వంచరస్ సన్నివేశాలు సైతం ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇండియా మినహా ఇతర దేశాల్లో ఈ చిత్రం రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్‌కు రాగా ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియాలో ఓటీటీకి రానుంది. అయితే.. ఇప్పటికే పలు థర్డ్ పార్టీ యాప్స్, ఫ్రీ వెబ్ సైట్లలోనూ వచ్చేసింది. హాలీవుడ్ సినిమాలు ముఖ్యంగా అనకొండలను ఇష్టపడే వారు ఈ సినిమాను హాయిగా చూసేయవచ్చు.