డైరెక్ట్ ఓటీటీకి వ‌చ్చేసిన‌.. జీవీ ప్ర‌కాశ్‌, అన‌శ్వ‌ర మూవీ! సూప‌ర్ రెస్పాన్స్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:40 AM

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (GV Prakash) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘లక్కీ ది సూపర్‌స్టార్‌’ (lucky the superstar) . జియో హాట్‌స్టార్‌లో (jio hotstar) విడుదల చేశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (GV Prakash) హీరోగా న‌టించిన‌ కొత్త చిత్రం ‘లక్కీ ది సూపర్‌స్టార్‌’ (lucky the superstar). జియో హాట్‌స్టార్‌లో (jio hotstar) విడుదల చేశారు. అన‌శ్వ‌ర రాజన్‌ హీరోయిన్‌. ‘నాలై, చక్రవ్యూహం’ వంటి చిత్రాలను రూపొందించిన ఉదయ్‌ మహేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల సెట్స్‌పైకి వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే, థియేటర్‌లో కాకుండా జియో హాట్‌స్టార్‌లో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ యేడాది ఓటీటీలో నేరుగా విడుదలైన మూడో చిత్రం ‘లక్కీ’ కావడం గమనార్హం. జనవరి ఒకటో తేదీ తగినన్ని థియేటర్లు లభించని కారణంగా ‘సెల్లియర్‌గల్‌’ అనే మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేయగా, జనవరి 13న సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ‘అనంత’ అనే చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. ఇదిలావుంటే.. ఈ ‘లక్కీ ది సూపర్‌స్టార్‌’ (lucky the superstar) చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది

Updated Date - Feb 21 , 2026 | 09:18 AM