Gullak OTT: మిశ్రా ఫ్యామిలీ సంద‌డి షురూ.. 'గుల్ల‌క్' వెబ్ సిరీస్‌ సీజ‌న్ 5 వ‌చ్చేస్తోంది! ఆల్ ఫ్యామిలీస్ గెట్ రెడీ

ABN , Publish Date - May 27 , 2026 | 09:08 PM

ఎంతో ప్రాచూర్యం పొందిన ప్ర‌ముఖ మ‌రాఠి, హిందీ వెబ్ సిరీస్ గుల్ల‌క్ (Gullak) నుంచి అభిమానుల‌కు ఎట్ట‌కేల‌కు ఓ గుడ్‌న్యూస్ వ‌చ్చింది.

Gullak

ఎంతో ప్రాచూర్యం పొందిన ప్ర‌ముఖ మ‌రాఠి, హిందీ వెబ్ సిరీస్ గుల్ల‌క్ (Gullak) అభిమానుల‌కు ఎట్ట‌కేల‌కు ఓ గుడ్‌న్యూస్ వ‌చ్చింది. ఈ సిరీస్‌లో 5వ సీజ‌న్ స్ట‌ర్ఈమింగ్‌కు రండం సిద్ధ‌మైంది. తొలుత 2029లో ప్రారంభ‌మైన ఈ వెబ్ సిరీస్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే విశేష ప్ర‌జాద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని ప్ర‌త్యేక ప్యాన్ బ్యేస్‌ను సొంతం చేసుకుంది.

నిత్యం మ‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇండ్లలో జ‌రిగే సంఘ‌ట‌న‌లు, తోటి ఫ్యామిలీల‌తో, బ‌య‌ట వ్య‌క్తుల‌తో న‌డిచే స‌ర‌దా సంభాష‌ణ‌లు డ‌బ్బు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌వుతూ న‌లుగురు స‌భ్యులు ఉన్న‌ కుటుంబం రోజువారి వారి జీవితంలో చేసే అల్ల‌రి ప‌నులు, ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డానికి ప‌డే పాట్ల చుట్టూ ఈ సిరీస్ సాగుతూ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌తి ఎపిసోడ్ మ‌నం అల్రెడీ అనుభ‌వించిన‌, చూస్తున్న‌ లైఫ్‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తుంది. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు మొఖంలో న‌వ్వు చెరిగిపోనీయ‌కుండా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది..

ఇప్ప‌టికే నాలుగు భాగాలుగా వ‌చ్చిన ఈ సిరీస్ సోనీ లివ్ (SonyLIV) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సిరీస్ గురించి తెలియ‌ని వారు, మంచి క్లీన్ ఫ్యామిలీ సిరీస్ చూడాల‌నుకునే వారికి ఈ గుల్ల‌క వెబ్ సిరీస్ మంచి ఫుల్ మీల్స్ లాంటిది. అయితే.. ఈ సిరీస్‌లో 5వ సీజ‌న్ కూడా స్ట్రీమింగ్‌ రెడీ అయింది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధ‌ఙంచిన ట్రైల‌ర్ విడుద‌ల అవ‌గా జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ అవ‌నుంది.

Updated Date - May 27 , 2026 | 09:08 PM