DC Movie: ఓటీటీలోకి ‘DC’.. స్ట్రీమింగ్‌ .. ఎప్పుడు.. ఎక్కడంటే..

ABN , Publish Date - Oct 13 , 2026 | 02:57 PM

ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం.. ఈ మూడు అంశాల చుట్టూ సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘DC’.

DC Movie OTT

ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం.. ఈ మూడు అంశాల చుట్టూ సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘DC’. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే  సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో  ఓటీటీలో  స్ట్రీమింగ్ కు సిద్దమయింది. అక్టోబర్‌ 16 నుంచి ప్రముఖ డిజిటల్‌ వేదిక సోనీ లివ్‌ (SonyLIV)లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. కొన్ని కథలు ప్రేమతో మొదలై అనూహ్య మలుపులు తిరుగుతాయి. మరికొన్ని నమ్మకద్రోహం, ప్రతీకారం కారణంగా కొత్త దారులు వెతుక్కుంటాయి. మనుషుల మధ్య సంబంధాలు, క్లిష్ట పరిస్థితుల్లో వారు తీసుకునే నిర్ణయాలు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలను ‘DC’ కథలో ఆసక్తికరంగా ఆవిష్కరించారు దర్శకుడు. ఇందులో లోకేష్ కనకరాజు, వామిక గబ్బి జంటగా నటించారు. 

కథ:

ఆర్మ్స్ రాబరీ కేసులో జైలులో ఉన్న సర్కార్ కు దేవదాసు (లోకేష్ కనగరాజ్), అతని స్నేహితులు పరిచయమవుతారు. అప్పటి నుంచి దేవదాసు టీమ్ సర్కార్ తో కలిసి పని చేస్తుంటుంది. దేవదాసు మంచి వైపు ఉండాలని కోరుకునే వ్యక్తి. కానీ ఓ రాబరీ కేసులో పోలీసులు ఈ గ్యాంగ్ ను  వెంటాడుతుంటారు. ఈ క్రమంలో అన్యాయంగా ఓ అమాయకుడిని చంపిన ఓ పోలీస్ అధికారిని దేవదాస్ అండ్ గ్యాంగ్ చంపేస్తుంది. దీంతో పోలీసులు ఈ గ్యాంగ్ పై మరింత ఫోకస్ పెడతారు. అసలు దేవదాస్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి? పోలీసులు వీరిని ఎందుకు టార్గెట్ చేశారు? విజయవాడ లాడ్జ్ లో దేవదాసుకు పరిచయమైన గాయని పార్వతి (సంజనా కృష్ణమూర్తి) ఎందుకు మరణించింది? వేశ్యాగృహంలో పరిచయమైన చంద్రిక (వామిక గబ్బి) దేవదాసులో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఫైనల్ గా దేవదాసు అనుకున్నది చేశాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.

Updated Date - Oct 13 , 2026 | 03:10 PM