డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో

ABN , Publish Date - Mar 02 , 2026 | 08:54 PM

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ (Daughter of Prasadrao)సిరీస్ జీ5 ఓటీటీలో (Zee5) దూసుకుపోతుంది.  రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ (Daughter of Prasadrao)సిరీస్ జీ5 ఓటీటీలో (Zee5) దూసుకుపోతుంది.  రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.  స్ట్రీమింగ్ మొదలైన 75 గంటల్లోనే ఈ సిరీస్‌కి 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. దీనిని బట్టి ఏ సిరీస్ కి చక్కని ఆదరణ దక్కిందని తెలుస్తోంది. ఇది డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. 

ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన అమ్మాయి కనిపించకపోవడం, కూతురు కనిపించకపోవడంతో తండ్రి పడే బాధ, మిస్టరీగా మారిన అమ్మాయి కేసుని చేదించే క్రమంలో పోలీసులకు ఎదురైన సవాళ్లు ఇలా అనేక లేయర్స్‌తో తీసిన ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ని కట్టి పడేసింది. ప్రస్తుత సమాజంలోని పరిస్థితులు, సిటీ లైఫ్, లేడీస్ హాస్టల్‌లో జరిగే ఘటనలు, అమ్మానాన్నల పెంపకం, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ గురించి ఇలా ఎన్నో విషయాల్ని ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చెప్పే ప్రయత్నం చేసింది. సమాజానికి ఓ చక్కని సందేశం ఇచ్చేలా తీసిన ఈ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్‌ మున్ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

 

Updated Date - Mar 02 , 2026 | 08:54 PM