Mana Shankara Vara Prasad Garu: ఓటీటీకి.. మన శంకర వరప్రసాద్! ఎప్పటినుంచంటే
ABN , Publish Date - Feb 04 , 2026 | 07:35 AM
సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు (Mana Shankara Vara Prasad Garu). అనీల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఈ మూవీ వింటేజ్ చిరును తిరిగి మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేసి అదిరిపోయే వజయాన్ని మూటగట్టుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిరంజీవి కెరీర్‌లోనే అగ్ర స్థానంలో నిలిచింది. అలాంటి ఆ చిత్రం రిలీజ్ అయి నాలుగు వారాలు కావస్తున్నా మంచి రెస్పాన్స్‌తో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకర్ తన నుంచి విడిపోయిన భార్య, పిల్లలను తిరిగి కలుసుకోవాలని వారనితో కలిసి జీవించాలని అనుకుంటాడు. అందుకోసం తన పిల్లలు చదివే స్కూల్‌లో పీఈటీగా చేరి వారికి దగ్గర అవుతాడు. ఆపై ఫ్యామిలీ విడిపోవడానికి కారణమైన మామకు ఎలాగైనా బుద్ది చెప్పాలని డిసైడ్ అవుతాడు. అదే సమయంలో దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ ఉమెన్ అయిన భార్య శశిరేఖపై ప్రత్యరులు దాడి నుంచి తప్పించుకుంటుంది. దీంతో సెంట్రల్ మినిస్టర్ వారిఇక సెక్యూరిటీగా శంకర్ అండ్ టీంను పంపిస్తాడు. ఈ క్రమంలో శంకర్ ఎలా శశిరేఖ మనసును గెలుచుకున్నాడు, మామకు బుద్ది ఎలా చెప్పాడనే పాయింట్‌లో సినిమా ఎక్కడా గాడి తప్పకుండా ప్రతి క్షణం నవ్వులు పూయిస్తూ సినిమా సాగుతుంది.
సినిమాలో తరుచూ వచ్చే చిరంజీవి పాత పాటలు, సింగిల్ లైనర్స్, పంచులు, ప్రాసలు ఆకట్టుకుంటాయి. ఇక ఫ్రీ క్లైమాక్స్‌లో వెంకటేశ్ (Venkatesh) ఎంట్రీ తర్వాత సినిమా మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కాగా ఈ మన శంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు (Mana Shankara Vara Prasad Garu) మూవీ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఫ్యామిలీతో సరదాగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేవచచ్చు.