Chennai Love Story: చెన్నై లవ్‌స్టోరీ ఓటీటీలో ఎప్పుడు.. ఎక్కడంటే.

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:58 PM

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై  ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ ఓటీటీ  సోనీలివ్‌లో ఆగస్టు 21 నుంచి ‘చెన్నై లవ్‌స్టోరీ’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీని చూసే అవకాశం కలగనుంది. 

కథ:

నెల్లూరుకు చెందిన స్టీవెన్‌ శంకర్‌ ఓ అనాథ. సినిమాపై పిచ్చితో ఎలాగైనా డైరెక్టర్ కావాలనే తపనతో చెన్నైలో వాలిపోతాడు. నివేదిత అలియాస్‌ నివి (శ్రీగౌరీ ప్రియ)కి మూడేళ్ళు ప్రేమించిన అబ్బాయితో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. చెన్నైలో ఉద్యోగం చేసే నివీ ఆ మందుకు బానిస అవుతుంది. ఆమె స్నేహితులు వారించి, కొద్దికాలం తనను ప్రశాంతంగా వదిలేయ్ మని కోరుతుంది. ఆమె స్నేహితులకు పరిచయమైన స్టీవెన్‌ను అదే ప్లాట్‌లో ఉండమని పిలుస్తారు. మొదట్లో నివి అతన్ని పట్టించుకోదు. ఓ సందర్భంలో అతనిపై విరుచుకు పడుతుంది కూడా. స్టీవెన్‌ అనుభవించిన సినిమా కష్టాలు తెలుసుకున్నాక ఓ నిర్మాతతో మాట్లాడి కథ చెప్పే అవకాశం ఇప్పిస్తుంది. అలా స్టీవెన్ ఓ మంచి కథ చెప్పడం, దర్శకుడిగా అవకాశం పొందటం జరుగుతుంది. ఓ సందర్భంలో నివి 'మనం పెళ్ళి చేసుకుందామా?' అని స్టీవెన్ ను అడగడంతో అతను వెంటనే సరేనంటాడు. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు స్టీవెన్‌కు యాక్సిడెంట్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నివిని పెళ్లి పీటల మీద వదిలేసిన అజయ్‌ (తిగుణ్‌) మళ్లీ ఎందుకు ఆమె జీవితంలోకి వచ్చాడు? నివి నిజంగా ప్రేమించింది ఎవర్నీ? ఫైనల్‌గా ఎవర్ని పెళ్లి చేసుకుంది? అన్నది కథ.

Updated Date - Aug 15 , 2026 | 01:06 PM