Champion: ఓటీటీకి.. వ‌చ్చేస్తున్న ‘ఛాంపియన్‌'

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:19 PM

రోషన్‌ మేక హీరోగా తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా ‘ఛాంపియన్‌’ (Champion) ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

రోషన్‌ మేక హీరోగా తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా ‘ఛాంపియన్‌’ (Champion). ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనస్వర రాజన్‌, అవంతిక, హైపర్‌ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఈనెల 29 (Champion Streaming Date) నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది.  

కథ:

చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మైఖేల్ విలియమ్స్ ఓ బేకరిలో పని చేస్తూ అక్కడి వారితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అవకాశం లభిస్తే ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటలో బాగా ప్రావీణ్యం ఉన్న మైఖేల్ సికింద్రాబాద్ ఫుట్బాల్క్లబ్ మెంబర్. హైదరాబాద్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో మైఖేల్ ప్రదర్శనను తిలకించిన బ్రిటీష్ అధికారి ఇంగ్లాండ్ లోని క్లబ్ లో ఫుట్బాల్ ఆడేందుకు ఎంపిక చేస్తాడు. అయితే మైఖేల్ తండ్రి నేపథ్యం వల్ల మైఖెల్ లీగల్గా ఇంగ్లాండ్కు వెళ్లే అవకాశం లేక సీక్రెట్గా ఆయుధాలు సరఫరా చేస్తే ఇంగ్లండ్ కు వెళ్లే ఛాన్స్ దక్కుతుందని భావించి ఒప్పుకుంటాడు. తీరా ఆ పని లో భాగంగా రజాకార్ల దృష్టిలో పడకుండా పారిపోతూ అనుకోకుండా బైరాన్పల్లి చేరి అక్కడ కొద్ది రోజులు రహస్యంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

roshan.jfif

ఇదిలాఉంటే... 1947లోనే అనేక సంస్థానాలు భారతదేశంలో కలిసిపోగా నిజాం సంస్థానం మాత్రం అందుకు భిన్నంగా వ్యహరిస్తూ ఉంటుంది. హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉంటుంది కానీ భారత్లో కలపం అంటూ ఖాసీం రిజ్వీ ఖరాఖండిగా తేల్చేస్తాడు. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న, ఎదురు దాడులు చేస్తున్న ఊర్లపై పడి అక్కడి ప్రజలను చంపుతూ ఉంటుంది రిజ్వీ సైన్యం. అయితే బైరాన్పల్లి గ్రామం మాత్రం రజాకార్ సైన్యాన్ని ఎదురిస్తూ వారికి మింగుడు పడదు. దాంతో ఆ ఊరిని ఎలాగైనా నాశనం చేయాలని సైన్యం ఎదురు చూస్తున్న సమయంలో మైఖేల్ ఆ ఊరికి వచ్చి చేరతాడు. ఆ తర్వాత అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చంద్రకళతో ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అక్కడి ప్రజలతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఇంగ్లాండ్ పోవాలని కలలు కన్న మైఖేల్ ఎందుకు తిరిగి ఆ గ్రామానికి వచ్చాడు? అసలు అతని తండ్రి ఎవరు? అతను చేసిన పనేంటి? అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.

Updated Date - Jan 24 , 2026 | 10:03 PM