Vadhandhi OTT: అదిరిపోయే బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. సీక్వెల్ వ‌చ్చేస్తోంది

ABN , Publish Date - Jul 28 , 2026 | 10:53 AM

బ్లాక్‌బస్టర్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'వదంతి' రెండో సీజన్ వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది.

Vadhandhi

ఒక వెబ్ సిరీస్ సక్సెస్ అయితే దానికి సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు సహజంగానే పెరుగుతాయి. ఇప్పుడు అదే జాబితాలో మోస్ట్ అండ‌రేటెడ్‌ తమిళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని (Vadhandhi: The Fable of Velonie) చోటు సంపాదించుకుంది. తొలి సీజన్‌తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ అధికంగా ద‌క్కించుకున్న‌ ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు 'వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి (Vadhandhi: The Mystery of Mani) పేరుతో రెండో సీజన్‌ను స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మొదటి సీజన్‌లో ఎస్.జే. సూర్య ప్రధాన పాత్రలో సిరీస్‌ను అద్యంతం ర‌క్తి క‌ట్టించారు.

కాగా.. ఈ సెకండ్ సీజ‌న్ కొత్త కథ, నూత‌న పాత్ర‌ల‌తో ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా సాగనుంది. మధురైలో ఓ హైవే ప్రాజెక్ట్ పనుల సమయంలో బయటపడిన అస్థిపంజరం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సబ్ ఇన్‌స్పెక్టర్ మూసా రాజా పాత్రలో ప్రముఖ నటుడు శశికుమార్ (Sasikumar) కనిపించనున్నారు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ 'మణి' అనే ఖైదీ చుట్టూ దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ మరోసారి ప్రేక్షకులను సస్పెన్స్‌లో ముంచెత్తేలా రూపొందించారు.

ఈ వెబ్ సిరీస్‌కు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించగా.. పుష్కర్-గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సీజన్‌లో యశ్వంత్ (Yashwanth), అనఘ (Anagha), అపర్ణ దాస్ (Aparna Das), వివేక్ ప్రసన్న (Vivek Prasanna), రేవతి శర్మ, అర్జున్ నందకుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ వదంతి: ది మిస్టరీ ఆఫ్ మణి సిరీస్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్లలోనూ స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - Jul 28 , 2026 | 11:05 AM