Lenin: ఓటీటీలో.. తుక్కు రేగ్గొడుతున్న అయ్య‌గారు

ABN , Publish Date - Aug 11 , 2026 | 10:26 PM

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా జీ5లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

lenin

గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin,) సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీ (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లెనిన్’.. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు మేకర్స్ తెలిపారు.

థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అఖిల్ నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జీ5లో ‘లెనిన్’కు మంచి వ్యూస్ వస్తున్నాయి.

ఓటీటీలోనూ అదే జోరు..

సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ మొదలైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనమని మేకర్స్ చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘లెనిన్’ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కథ..

చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథను తెరకెక్కించారు. లెనిన్‌కు ప్రాణ స్నేహితుడే ఎందుకు ద్రోహం చేశాడు? ఆ ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాడు? రామచంద్రపురంలో జరిగిన కురుక్షేత్రంలో చివరికి ఎవరు గెలిచారు? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

అఖిల్ నటనకు మంచి రెస్పాన్స్

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే చాలా భిన్నమైన పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. అఖిల్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తో పాటు తన నటనతోనూ మెప్పించింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథ, కథనం, టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయి.

Updated Date - Aug 11 , 2026 | 10:26 PM