SI Yugandhar: అస‌లు బాలేద‌న్నారు.. ఇప్పుడు చించుకుంటున్నారేంట్రా

ABN , Publish Date - Nov 01 , 2026 | 06:34 PM

ఆది సాయి కుమార్ హీరోగా రూపొంది ఇటీవ‌ల చ‌ప్పుడు కాకుండా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియ‌కుండా మెరుపు తీగ‌లా వ‌చ్చి పోయిన చిత్రం స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ యుగంధ‌ర్.

Aadi Saikumar Sub-Inspector Yugandhar

ఆది సాయి కుమార్ (Aadi Saikumar) హీరోగా రూపొంది ఇటీవ‌ల చ‌ప్పుడు కాకుండా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియ‌కుండా మెరుపు తీగ‌లా వ‌చ్చి పోయిన చిత్రం స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ యుగంధ‌ర్ (Sub-Inspector Yugandhar). రాఘ‌వేంద్ర క‌టారి (Raghavendra Katari)ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మేఘ లేఖ కంచర్ల (Meghalekha Kacharla), రాకేందు మౌళి (Rakendu Mouli), కాదండ‌రి కిర‌ణ్‌, ప‌వ‌న్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గ‌తేడాదే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనేక వాయిదాల అనంత‌రం ఎట్ట‌కేల‌కు ఆక్టోబ‌ర్‌2న థియేట‌ర్ల‌కు వ‌చ్చింది. కానీ స‌డ‌న్ రిలీజ్ ఆపై అస‌లు ఎలాంటి ప్ర‌చారం లేకపోవ‌డంతో ఇదో చిత్రం వ‌చ్చిన సంగ‌తే చాలా మందికి తెలియ‌కుండా పోయింది. అంతేగాక చూసిన ఒక‌రిద్ద‌రు కూడా నెగిటివ్ రివ్యూలు ఇవ్వ‌డంతో వారం రోజుల‌కే సినిమా థియేట‌ర్ల నుంచి స‌ర్థ‌కుంది.

అయితే.. రెండు రోజుల క్రితం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఓటీటీలో విశేష ప్రేక్ష‌కాధ‌ర‌ణతో దూసుకుపోతోంది. అస‌లు ఈ సినిమాను థియేట‌ర్ల‌లో ఎలా మిస్ అయ్యామురా అంటూ ఇప్పుడు అశ్య‌ర్య పోతున్నారు. ఇంత అదిరిపోయే థ్రిల్ల‌ర్ కంటెంట్‌ను పెట్టుకుని మేక‌ర్స్ ఎందుకు ప్ర‌చారం చేయ‌లేదు, రివ్యూవ‌ర్స్ ఎందుకు అంత‌గా నెగిటివిటీ చేశారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అంతేగాక థ్రిల్ల‌ర్స్, ఇన్వెస్టిగేష‌న్ జాన‌ర్ల సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఇది మ‌స్ట్‌ వాచ్ ఫిలిం అంటూ స్వ‌యంగా ఇన్ స్టా, ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో క్ర‌మంగా ఈ సినిమా చూసే వారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతూ ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటోంది. ఇది సినిమా క‌న్నా సిరీస్‌గా వ‌చ్చి ఉంటే దీని రేంజ్‌ వేరే లెవెల్‌లో ఉండేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

aadi.jpg

క‌థ విష‌యానికి వ‌స్తే.. త‌రుచూ పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌చ్చి ఓ మాన‌సిక స‌మ‌స్య కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటాడు ఎస్సై యుగంధ‌ర్‌. ఓ రోజు బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన ఐపీయ‌స్ అధికారి స‌డ‌న్‌గా హ‌ర్ట్ అటాక్‌తో చనిపోతాడు. అయితే ఎస్సై యుగంధ‌ర్ చేసిన పొర‌పాటు వ‌ళ్ల ఆ ఐపీయ‌స్ అధికారి డెడ్‌ బాడీ మిస్ అవుతుంది. దీంతో ఎస్సైని సస్పెండ్ చేస్తారు. దాంతో ఆ డెడ్ బాడీని వెతికే క్ర‌మంలో అది హార్ట్‌ ఎటాక్ మ‌ర‌ణం కాదని ఫ్లాన్ ప్ర‌కారం చేసిన మ‌ర్డ‌ర్ అని తెలుస్తుంది. ఆ కేసును ప‌రిశోధిస్తున్న స‌మ‌యంలో మ‌రి కొంత‌మంది కూడా హార్ట్‌ అటాక్స్ బారిన ప‌డిన‌ట్లు తెలుస్తుంది.

అంతేగాక‌ దీని వెన‌కాల ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్, పెద్ద ముఠా ఉండ‌డంతో పాటు, ఓ అంతుబ‌ట్ట‌ని ఇష్యూ రాబోతున్న‌ట్లు క‌నిపెడ‌తాడు. దానిని ఎస్సై యుగంధ‌ర్ ఎలా చేధించాడు, ఈ క్ర‌మంలో అత‌ను ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్నాడు, కిల్ల‌ర్ ఎందుకు అలా చేశాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ క‌థ‌నాల‌తో, ఊహించ‌ని ట్విస్టుల‌తో సినిమా సాగుతుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, మంచి అదిరిపోయే ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ చూడాల‌నుకునే వారికి ఈ ఎస్సై యుగంధ‌ర్ (SI Yugandhar) సినిమా ఫుల్ మీల్స్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది.

Updated Date - Nov 01 , 2026 | 06:46 PM