Y. S జగన్‌ 'బంటు' బాగోతంలో.. సినీ తార, టీవీ నటి! మాల్దీవుల్లో జల్సాలు.. లక్షల్లో ఖర్చు

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:19 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి బంటు వ్యవహారంలో ఓ టీవీ నటి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

Y.S. Jagan’s Aide

వైసీపీ హయాంలో జగన్ (Y. S. Jagan Mohan Reddy) కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన బంటు చుట్టూ వినిపిస్తున్న ఆరోపణల్లో ఇప్పుడు ఓ టీవీ నటి (TV Actress) వ్యవహారం ఆసక్తికరంగా మారింది. విదేశీ పర్యటనలు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED Investigation) దర్యాప్తులోకి బంటుకు ఓ బుల్లితెర నటితో ఉన్నట్లు ప్రచారంలో ఉన్న సంబంధాల అంశం కూడా వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలైందని, ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత దూరం వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మాల్దీవుల పర్యటనలోనూ బంటు పలువురు సినీ తారలతో సమయం గడిపినట్లు ఈడీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల (Betting App Controversy) వివాదంలో చిక్కుకున్న ఓ బుల్లితెర నటితో పాటు, మాల్దీవుల పర్యటనలో (Maldives Trip) పాల్గొన్న మరో సినీ నటిపై కూడా అధికారుల దృష్టి పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే సదరు నటీమణులకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశముందనే చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే, విజయవాడలో కృష్ణా నది వరద ప్రవాహం కృష్ణలంక వైపు రాకుండా అడ్డుగా గోడ నిర్మించిన కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు ఓ టీవీ నటికి డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఆ చెల్లింపులు ఎందుకు జరిగాయి? వాటి వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలేమిటి? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై ఈడీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - Nov 16 , 2026 | 07:19 AM