విరోష్‌.. సంగీత్‌ ఫోటోలు వచ్చేశాయ్!

ABN , Publish Date - Mar 03 , 2026 | 10:42 AM

విరోష్‌ జంట సంగీత్‌కు సంబంధించిన ఫోటోలు వచ్చేశాయ్. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న అభిమానులంతా వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సంగీత్ ఎలాంటి ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందో ఈ ఫోటోలను చూస్తే అర్థమౌతుంది.

Virosh Sangeeth

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్ళి సంగతి ఏమో కానీ దానికి ముందు, ఆ తర్వాత జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నారు. సోమవారం తమ స్వగ్రామంలో జరిగిన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, తదనంతరం గ్రామ వాసులతో విజయ్ దేవరకొండ జరిపిన ఆత్మీయ సంభాషణలకు సంబంధించిన వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి. మార్చి 4న నూతన వధూవరుల వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఓ పక్క ఏర్పాట్లు జరుగుతుండగా, విజయ్‌ దేవరకొండ ఫిబ్రవరి 24న జరిగిన తమ సంగీత్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

296A9159 copy.jpg

ఈ ఫోటోలతో పాటు విజయ్ తన మనసులోని భావాలను సైతం పొందికగా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.

296A1514 copy.jpg


WhatsApp Image 2026-03-02 at 21.19.51 (2) copy.jpg

వివాహానికి ముందు తమ సంగీత్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగిందని విజయ్‌ పేర్కొంటూ, 'నవ్వుతూ కన్నీళ్ళు వచ్చే వరకూ గడిపిన ఆ సాయంత్రాన్ని మరవలేను. పాదాల కండరాలు నొప్పి పుట్టేవరకూ డాన్స్ చేశాం. అక్కడ హాజరైన వారి మాటలు, తద్వారా కలిగిన భావోద్వేగాలు, కళ్ళలో నీళ్ళు ఉబికిన ఆ క్షణాలను గొప్పగా ఆస్వాదించాం. అందమైన మనుషులతో సాగిన ఆ సంతోషకరమైన సంగీత్ కార్యక్రమం నాటి రాత్రి గొప్ప అనుభూతులను మిగిల్చింది' అంటూ విజయ్‌ పేర్కొన్నారు.

WhatsApp Image 2026-03-02 at 21.19.50 (1) copy.jpg

ఈ సందర్భంగా విజయ్‌ విడుదల చేసిన ఫోటోలను నెటిజన్స్ విశేషంగా ఆదరిస్తూ... ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 10:50 AM