నంది అవార్డు గ్రహీత లక్ష్మీ కన్నుమూత!
ABN , Publish Date - Apr 28 , 2026 | 10:26 AM
భీమవరానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారిణి లక్ష్మీ గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు ఆమె రంగస్థలంపై నాటకాలు వేశారు.
దాదాపు నాలున్నర దశాబ్దాల పాటు రంగస్థల కళాకారిణిగా సేవలు అందించిన భీమవరం లక్ష్మీ (61) కన్నుమూశారు. ఆమె భర్త టైలర్, కొడుకు మధు డాన్స్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. రంగస్థలంలో అనేక సాంఘిక నాటికలు, నాటకాలు ఆమె ప్రదర్శించారు. మూడు ప్రభుత్వ నంది అవార్డులను అందుకున్నారు. పౌరాణిక, పద్య నాటకాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మృతి గురించి భీమవరం ఆర్టీసీలో పనిచేసే రత్తయ్య మాట్లాడుతూ, 'తమతో కలిసి ఆమె ఎన్నో నాటకాలు ప్రదర్శించారని, ప్రతి ఒక్కరిని గురువు గారూ అని ఆత్మీయంగా పిలిచేవారని, నాటక రంగం ఓ మంచి నటిని, అంతకు మంచి ఓ మనసున్న మనిషిని కోల్పోయింద'ని అన్నారు.
భీమవరం లక్ష్మీ నాటకాల్లో ప్రధాన పాత్రలే కాదు... ప్రముఖ నటుల పక్కన సైడ్ క్యారెక్టర్ చేయడానికి కూడా ఎప్పుడూ వెనకాడలేదు. అలానే కలహకంటిక, వసంత, రాధ, మాతంగ వంటి పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మృతికి సహచర రంగస్థల కళాకారులు నివాళులు అర్పించారు.