Theater Movies: ఈవారం.. థియేటర్ సినిమాలు! ఆ మూడు.. స్పెషల్ గురూ
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:59 PM
సినీ ఫ్యాన్స్ కోసంసెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఐదు స్ట్రెయిట్ మూవీస్- మూడు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి.
ప్రతి వారం కొత్త సినిమాల కోసం సినీ ఫ్యాన్స్ అమితాసక్తితో ఉంటారు.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అలాంటి వారికి ఆనందం పంచేందుకు ఐదు స్ట్రెయిట్ మూవీస్- మూడు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి.. వాటి తీరేంటో చూద్దాం.
యూత్ టార్గెట్ గా..
తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే అదరహో అనేలా యూత్ ను ఆకట్టుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తరువాత 'యానిమల్'తో ఆల్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' తెరకెక్కిస్తున్నారు సందీప్. ఇంత క్రేజ్ ఉన్న సందీప్ ఇప్పుడు 'రోమాంచకంస (Romanchakam) అనే యూత్ ఫుల్ మూవీకి సమర్పకునిగా వ్యవహరించారు. ప్రణయ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు వేణు గోపాల్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3వ తేదీన 'రోమాంచకం' వెలుగు చూస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే యువతను ఆకట్టుకుంటూ సాగుతోంది. అదే రోజున దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన 'ఐ యామ్ గేమ్స (I'm Game) కూడా రిలీజ్ అవుతోంది. మళయాళం నుండి అనువాదమైన ఈ చిత్రంలో కయాదు లోహార్ కథానాయిక. ఈ సినిమాకు నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలతో ఈ వారం మూవీ సందడి ముందుగా సాగనుంది.
ఆల్రెడీ అలరించినవే...
ఈ వారం మరో నాలుగు స్ట్రెయిట్ మూవీస్, రెండు డబ్బింగ్ సినిమాలు సెప్టెంబర్ 4న విడుదల కానున్నాయి. పంకజ్ త్రిపాఠి, ఫజల్, దివ్వేందు, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఓటీటీలో భలేగా అలరించింది. ఇప్పుడు అదే చిత్రంగా రాబోతోంది. హిందీ నుండి అనువాదమైన 'మీర్జాపూర్' కు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. బిగ్ స్క్రీన్ పై 'మీర్జాపూర్స (Mirzapur: The Movie) ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో ఈ సిరీస్ చూసినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మళయాళంలో ఆగస్టు 21న విడుదలై విజయఢంకా మోగించింది 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్'. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నివీన్ పౌలీ, మమితా బైజూ జంటగా రూపొందిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) కు గిరీశ్ ఏడి దర్శకత్వం వహించారు. మళయాళంలో అలరించినట్టుగానే తెలుగులోనూ మురిపిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
అందరిదీ అదే తీరు..
ఇక సెప్టెంబర్ 4న వస్తున్న స్ట్రెయిట్ మూవీస్ విషయానికి వస్తే సహ- లైఫ్ ఆఫ్ సంజు (Sahaa (Life of Sanju)చిత్రం కొత్తవారితో రూపొందింది. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నిశాంత్ దోటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంజూ అనే వ్యక్తి జీవితంలోని జ్ఞాపకాల ఆధారంగా ఈ ఎమోషనల్ డ్రామా రూపొందింది. ఇక నవ్వులు పూయించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka) కూడా శుక్రవారం విడుదలవుతోంది. అల్లరి నరేశ్ మార్కు సినిమాగా ఇది తెరకెక్కింది. సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam) కూడా సెప్టెంబర్ 4నే వస్తోంది. మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. పల్లాకొండ శ్రీరామ్, స్వాతి మందాడి ప్రధాన పాత్రల్లో యద్దనపూడి మైఖేల్ రూపొందించిన మా రాముడు అందరివాడు (Maa Ramudu Andarivadu) కూడా అదే రోజున వెలుగు చూస్తోంది. సమాజం కోసం నిస్వార్థంగా సాగిన ఓ యువకుడి కథ ఇదని డైరెక్టర్ చెబుతున్నారు. మరి ఈ ఎనిమిది చిత్రాల్లో ఏది ఏ రేంజ్ లో ప్రేక్షకులను రంజింప చేస్తుందో చూడాలి. ఇదిలాఉంటే.. ఇక హాలీవుడ్ నుంచి వన్ స్లాట్, ది మ్యాజిక్ ఫారవే వంటి 2 సినిమాలతో పాటు తమిళంలో 5, కన్నడ, హిందీ నుంచి 2 చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఈవారం.. థియేటర్ సినిమాలు This Week Theater Movies
Telugu
I'm Game Sep 3
Romanchakam Sep 3
Mirzapur: The Movie Sep 4
Sahaa (Life of Sanju) Sep 4
Ramba Oorvasi Menaka Sep 4
Maa Ramudu Andarivadu Sep 4
Bethlehem Kudumba Unit Sep 4
Dharmasthala Niyojakavargam Sep 4
Malayalam
I'm Game Sep 3
Kannada
Rou Sha Bi Sep 4
Life Ellind Ellige Sep 4
Tamil
I'm Game Sep 3
Paavai Sep 4
4 Idiots Sep 4
Immortal Sep 4
Delivery Boy Sep 4
7 Star Boys Sep 4
Hindi
I'm Game Sep 3
Mirzapur: The Movie Sep 4
Jeevan Bheema Yojana Sep 4
Gujarati
Asambhauuu Sep 4

English
Onslaught Sep 4
The Magic Faraway Tree Sep 4
Bengali
Winkle Twinkle Sep 4
Marathi
Dwidha Sep 4
Punjabi
Bol Bhavein Na Bol Sep 4