మెగాస్టార్ ని కలిసిన తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:03 PM

తెలుగు దర్శకుల సంఘం నూతన కార్యవర్గం మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రస్తుతం చేస్తున్న సేవా కార్యక్రమాలను, రాబోయే రోజుల్లో చేయాలనుకుంటున్న కార్యక్రమాలను ఆయనకు వివరించింది.

Telugu Film Directors Association

తెలుగు దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికలలో వి. ఎన్. ఆదిత్య (VN Aditya) - నీలం సాయి రాజేశ్‌ (Neelam Rajesh) ప్యానల్‌ భారీ మెజార్టితో విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా తెలుగు దర్శకుల సంఘం కార్యవర్గ సభ్యులంతా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా భారీ మెజార్టీ రావడానికి కారణమైన సాయి రాజేష్ ప్యానెల్ సభ్యులు గతంలో చేసిన కార్యక్రమాలు, వచ్చే రెండేళ్లలో చేయబోయే కార్యక్రమాల ప్రణాళికలు చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులకు పెన్నులు బహూకరించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం చిరంజీవిని వరించిన సందర్భంగా కమిటీ సభ్యులు మెగాస్టార్‌ని సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచిన ప్రముఖ దర్శకుడు, దర్శకుల సంఘం ట్రస్ట్‌కి కోశాధికారి మెహర్ రమేశ్‌ను కమిటీ సభ్యులు అభినందించారు.

ds1.jpg

Updated Date - Mar 13 , 2026 | 05:15 PM