ఎన్నికల బరిలో మూడు ప్యానెల్స్...
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:16 PM
మార్చి 8వ తేదీ ఆదివారం తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈపోటీలో వి.ఎన్.ఆదిత్య, మద్దినేని రమేశ్, వీరశంకర్ ప్యానెల్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది.
మార్చి 8వ తేదీ తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు జరుగ బోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో మూడు ప్యానెల్స్ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య (V.N. Aditya) తన శిష్యుడు సాయి రాజేశ్ (Sai Rajesh)తో కలిసి ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్రెసిడెంట్‌గా వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్‌గా సాయి రాజేశ్ పోటీ చేస్తున్నారు. జనరల్ సెక్రటరీగా పెండ్యాల రామారావు, వైస్ ప్రెసిడెంట్స్‌గా సముద్ర (Samudra), ఎస్వీ భాస్కర్ రెడ్డి; జాయింట్ సెక్రటరీస్‌గా ఎ. కృష్ణమోహన్, చెరుకూరి బాలాజీ; ఆర్గనైజింగ్ సెక్రటరీస్‌గా వంశీకృష్ణ దొండపాటి, ఎ. సునీల్ పోటీ చేస్తున్నారు. శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య, సాగర్ వి చంద్ర, నవీన్ మేడారం, అంజిబాబు గుంటూరు, అల్లాబక్ష్, ఎం. సాయి సురేంద్ర బాబు, ఇ. వెంకటేశ్వరరెడ్డి, రమణ మొగలి ఈ ప్యానెల్ నుండి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌గా పోటీ చేస్తున్నారు.
ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న వీరశంకర్ (Veera Shankar) ఈసారి ఎన్నికల బరి నుండి ఊహించని పరిణామాల మధ్య వైదొగినట్టు తెలుస్తోంది. అయితే... తనను నమ్మిన వారికి అండగా ఉండటానికి ఆయన వీరశంకర్ ప్రొగ్రెసివ్ ప్యానెల్‌ను పెట్టారు. ఈ ప్యానెల్ నుండి జనరల్ సెక్రటరీగా సిహెచ్. సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా జర్నలిస్ట్ ప్రభు, ఆర్గనైజింగ్ సెక్రటరీస్‌గా రాజా వన్నెంరెడ్డి, కూరపాటి రామారావు, జాయింట్ సెక్రటరీగా వడ్డాణం రమేశ్ బరిలో ఉన్నారు. ఈ ప్యానెల్ నుండి కొండా విజయ్ కుమార్, చాపర్ల లక్ష్మణరావు, మల్లిక ఈసీ మెంబర్స్‌గా పోటీ చేస్తున్నారు. ఇక మద్దినేని అండ్ కస్తూరి ప్యానెల్ నుండి ప్రెసిడెంట్‌గా మద్దినేని రమేశ్ (Maddineni Ramesh), జనరల్ సెక్రటరీగా కస్తూరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్స్‌గా సి. శ్రీనివాస్ (డాడీ), బి. సుబ్బారావు; జాయింట్ సెక్రటరీస్‌గా కె. కోటేశ్వరరావు (కె.కె.), రెట్టాడి శ్రీనివాసరావు; ఆర్గనైజింగ్ సెక్రటరీస్‌గా సిహెచ్. బాలరాజు, ఎన్. నవకాంత్ బరిలో ఉన్నారు. ఈ ప్యానెల్ నుండి ఈసీ మెంబర్స్‌గా కొవ్వూరి అనిల్ కుమార్, బి. అశోక్ రాజు, బద్రీనాథ్ వర్థన్, ఎం. బాలాజీ, జి.ఎన్. పూర్ణాచారి (పూర్ణేష్), పి.వి. రమేశ్ రెడ్డి, వై. శ్రీనివాసరావు, ఆర్.వి. సుబ్రహ్మణ్యం, కె. వెంకటరత్నం (బుజ్జి) పోటీ చేస్తున్నారు. దర్శకుల సంఘం ఎన్నికల ఓటింగ్ ఆదివారం ఉదయం 9 నుండి 3 గంటల వరకూ, సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది. మరి ఈ మూడు ప్యానెల్స్ నుండి ఎవరెవరు విజయం సాధిస్తారో చూడాలి.