Tamannaah Bhatia: తమన్నా టార్గెట్ చేసింది విజయ్ వర్మనేనా!?

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:38 PM

మిల్కీ బ్యూటీ తమన్నా జ్యువెలరీ విభాగంలో సరికొత్త బ్రాండ్ ను లాంచ్ చేసింది. ఇదే సమయంలో ఆమె తన రిలేషన్ షిప్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Tamannaah Bahtia

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ఆంట్రపెన్యూర్ గా మరోసారి తన సత్తా చాటే పనిలో పడింది. తన తోటి హీరోయిన్లు మాదిరిగానే ఆమె కూడా వ్యాపార రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. గతంలోనే తమన్నా జ్యువెలరీ బ్రాండ్ ను ప్రారంభించింది. ఇప్పుడా పనిని మరింత వేగంగా, ప్రతిభావంతంగా చేస్తోంది. జన్ జీ ను దృష్టిలో పెట్టుకుని, ఆమె సరికొత్త బ్రాండ్ ను ప్రారంభించింది. బంగారం, వెండి మిశ్రమ రంగుల్లో మెరిసే ఆభరణాలను ధరించి, తమన్నా చేసిన ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. జన్ జీ స్టైల్ లో ఆమె ధరించిన గోల్డ్ చైన్స్, ఇయర్ రింగ్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


ఇదిలా ఉంటే... తమన్నా తన బ్రేకప్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. టీనేజ్ లో ప్రేమలో పడిన తను కెరీర్ కోసం బ్రేకప్ చెప్పేశానని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు లేదా వచ్చిన కొత్తలో ఈ బ్రేకప్ జరిగిందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే 36 సంవత్సరాల తమన్నా చాలా పిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసింది. సో... లేలేత ప్రాయంలో తెలిసీ తెలియక ప్రేమలో పడినా... కెరీర్ కోసం ఆమె ఆ ప్రేమను వదిలేసుకుందని అనుకోవడంలో తప్పులేదు. అయితే కొంతకాలం క్రితం ఆమె విజయ్ వర్మతో రిలేషన్ షిప్ ఉంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ ప్లెసెస్ లో కనిపించడంతో పాటు పార్టీలకూ వెళుతుండటంతో త్వరలోనే వీరు పెళ్ళి పీటలు ఎక్కుతారని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో ఈ రిలేషన్ షిప్ కు బ్రేక్ పడింది. ఈ విషయాల గురించి ఇద్దరూ ఎప్పుడూ డైరెక్ట్ గా చెప్పింది లేదు. తాజాగా తమన్నా... తన రెండో బ్రేకప్ గురించి చెబుతూ, 'ఆ బంధంలో ఉండటం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరం అని గ్రహించి బయటకు వచ్చాను' అని తెలిపింది. ఇది ఖచ్చితంగా విజయ్ వర్మ గురించే అని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తమన్నా తొలి ప్రేమను కెరీర్ కోసం వదిలేసుకుంటే... ఇప్పుడు విజయ్ వర్మ కూడా కెరీర్ కోసమే తమన్నా ప్రేమకు దూరమయ్యాడని కొందరు అంటున్నారు. తమన్నా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి, పెళ్ళి చేసుకుని లైఫ్‌ లో సెటిల్ అవుదామని భావించిందని, కానీ ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్ వర్మ అందుకు అంగీకరించలేదని, అందుకే వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని సన్నిహితులు చెబుతున్నారు. కానీ తమన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు విజయ్ వర్మ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని, అతనిని పెళ్ళి చేసుకుంటే తన భవిష్యత్తు ప్రమాదకరమౌతుందని తమన్నా చెప్పడం సరైంది కాదని మరికొందరంటున్నారు. తమన్నా... డైరెక్ట్ గా విజయ్ వర్మ పేరు ప్రస్తావించకపోయినా... అతన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేసిందని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. మరి దీనిపై విజయ్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Updated Date - Jan 28 , 2026 | 04:11 PM