జూబ్లీహిల్స్‌లో.. శ్రీయ సంద‌డి

ABN , Publish Date - Mar 29 , 2026 | 09:30 PM

హైదరాబాద్‌లో జ్యువెలరీ రంగంలో మరో ప్రతిష్టాత్మక అడుగు పడింది.

shreya

హైదరాబాద్‌లో జ్యువెలరీ రంగంలో మరో ప్రతిష్టాత్మక అడుగు పడింది. ప్రముఖ సినీనటి శ్రీయ (Shriya Saran) చేతుల మీదుగా ఎస్‌కేటీ గోల్డ్ & డైమండ్స్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ 4వ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కొత్త షోరూమ్ ప్రారంభ వేడుకకు నగరానికి చెందిన ప్రముఖులు, ఆభరణాల ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు దోసపాటి కార్తిక్, పోలిసెట్టి ప్రసాద్, కల్కి, గంధే ఆకర్ష్ మాట్లాడుతూ ఆభరణం అనేది కేవలం అలంకారం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి భావోద్వేగాలకు ప్రతిబింబమని తెలిపారు. కస్టమర్లకు నాణ్యతతో కూడిన బంగారం, వజ్రాల ఆభరణాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

సంప్రదాయం స్పర్శతో ఆధునిక డిజైన్లను మేళవించిన ప్రత్యేక కలెక్షన్లు ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయి. వెడ్డింగ్ జ్యువెలరీ నుంచి డిజైనర్ కలెక్షన్స్ వరకు విభిన్న రకాల ఆభరణాలు వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించామని సంస్థ వెల్లడించింది.

లగ్జరీ జ్యువెలరీ షాపింగ్‌కు ఈ స్టోర్ కొత్త గమ్యస్థానంగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 09:51 PM