జీ ఎంటర్టైన్మెంట్‌కు సెబీ షాక్.. 2 నెలలు మార్కెట్ నిషేధం, సుభాష్ చంద్ర-పునీత్ గోయెంకాకు భారీ జరిమానా

ABN , Publish Date - Aug 02 , 2026 | 02:07 PM

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) భారీ షాక్ ఇచ్చింది.

ZEE

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) భారీ షాక్ ఇచ్చింది. మీడియా, వినోద రంగానికి చెందిన లిస్టెడ్ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ (Zee Entertainment) ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జె డ్ఈఎల్)ను క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. రెండు నెలల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేదించింది. అలాగే, కంపెనీ గౌరవ చైర్మన్ సుభాష్ చంద్ర (Subhash Chandra), ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా (Punit Goenka) పైనా ఏడాది నిషేధం విధించింది. అంతేకాదు, జెడ్ఈఎల్పై రూ.30 లక్షలు, చంద్రపై రూ.60 లక్షలు, గోయెంకాపై రూ.58 లక్షలు కలిపి మొత్తం రూ.1.48 కోట్ల జరిమానా కూడా విధించింది.

జెడ్ఈఎల్.. ఎస్సెల్ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్లైన సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా తమ ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న రుణం కోసం నిబంధనలకు విరుద్ధంగా జెడ్ఈఎల్‌కు హైదరాబాద్‌లో ఉన్న భూమిని తాకట్టు పెట్టినందుకు గాను సెబీ వీరిపై వేటు వేసింది. జెడ్ఈఎల్‌పై ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని శుక్రవారం రాత్రి జారీ చేసిన 150 పేజీల ఆర్డరు కాపీలో సెబీ స్పష్టం చేసింది. పెనాల్టీ సొమ్మును 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

ఈ నిర్ణయం మీడియా, వినోద రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలలో ఒకటైన జీ ఎంటర్టైన్మెంట్‌పై సెబీ తీసుకున్న చర్యలు కార్పొరేట్ గవర్నెన్స్ అంశంపై కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

Updated Date - Aug 02 , 2026 | 02:12 PM