రామ్ రాజ్ కాటన్ ప్రచారకర్తగా.. విజయ్ దేవరకొండ
ABN , Publish Date - Oct 08 , 2026 | 09:52 AM
రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు.
భారతీయ సంప్రదాయ వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన రామ్ రాజ్ కాటన్ (Ramraj Cotton) బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నియమితులయ్యారు. వివాహాలు, ఇతర శుభకార్యాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తమ వెడ్డింగ్ కలెక్షను విజయ్ దేవరకొండను ప్రచారకర్తగా నియమించుకున్నట్లు రామ్రాజ్ కాటన్ చైర్మన్, కేఆర్ నాగరాజన్, ఎండీ బీఆర్ అరుణ్ ఈశ్వర్ వెల్లడించారు.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ, నేటి తరానికి అనుగుణంగా రూపొందించిన 'లగ్న వెడ్డింగ్ కలెక్షన్'ను ఆధునిక డిజైన్, స్టైలింగ్‌తో తీసు కువచ్చినట్లు వారు తెలిపారు. రామ్ రాజ్ లగ్న వెడ్డింగ్ కలెక్షన్‌లో ప్రత్యేకమైన పట్టు ధోతీలు, పట్టు చొక్కాలు, అంగ వస్త్రాలతో పాటు వివాహాలు, పండగల కోసం రూపొందించిన ఇతర వస్త్రాలు కూడా ఉన్నాయన్నారు. విజయ్ దేవరకొండ ప్రచారంతో యువ తరానికి మరింత చేరువ కావచ్చని భావిస్తున్నట్లు వారు వెల్లడించారు.