పాప్ సింగర్ షకీరా ఇండియా టూర్! ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
ABN , Publish Date - Feb 21 , 2026 | 07:33 AM
గ్లోబల్ పాప్ ఐకాన్ 'వాకా వాకా' ఫేమ్ షకీరా (Shakira) భారతీయ అభిమానులకు తీపి కబురు అందించారు.
గ్లోబల్ పాప్ ఐకాన్ 'వాకా వాకా' ఫేమ్ షకీరా (Shakira) భారతీయ అభిమానులకు తీపి కబురు అందించారు. ఈ ఏడాది ఆమె తన గ్రాండ్ ఇండియా టూర్ నిర్వహించబోతున్నారు. జొమాటో 'ఫీడింగ్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీంతో చాలాకాలంగా షకీరా లైవ్ షో కోసం ఎదురుచూస్తున్న భారతీయ సంగీత ప్రియుల నిరీక్షణకు తెరపడింది. షకీరా చివరిసారి 2007లో ఉదయ్ పూర్‌లో ఒక ప్రైవేట్ వేడుకలో ప్రదర్శన ఇచ్చారు.

పాప్ లాటిన్, రాక్ సంగీత సమ్మేళనంగా షకీరా ఇచ్చే సంగీత ప్రదర్శన చూడడానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు. షకీరా ఈవెంట్ ఏప్రిల్ 10న ముంబైలోనూ, 15వ తేదీన ఢిల్లీలోనూ జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి జొమాటో యాప్‌లోని డిస్ట్రిక్ సెక్షన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటాయి. మార్చి మొదటి వారం నుంచి ముందస్తు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. పూర్తి షెడ్యూల్, టికెట్ ధరల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ ప్రదర్శన ద్వారా సేకరించిన నిధులను భారతదేశంలోని అన్నార్తుల కోసం నిర్వహించనున్న సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు.