Rajendra Prasad: 'నేనెవరు' చిత్రానికి ఆదరణ పెరుగుతోంది.

ABN , Publish Date - May 30 , 2026 | 10:04 PM

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక  చిత్రం 'నేనెవరు'.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ (Rajendraprasad) ప్రధాన పాత్రలో, సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ దర్శకుడు చిరంజీవి తన్నీరు రూపొందించిన సందేశాత్మక  చిత్రం 'నేనెవరు' (nenevaru) ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి తెలిపారు. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, అనేక కేంద్రాల్లో ఆక్యూపెన్సీ బావుందని వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్‌తో థియేటర్ల సంఖ్య పెరుగుతోందని, మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ  చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరణ అందించడం చాలా ఆనందంగా ఉందని, మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం సంతోషకరమని అన్నారు. చిత్ర దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారని, సినిమాలోని భావోద్వేగాలు, సందేశాత్మక అంశాలు, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.
   

Updated Date - May 30 , 2026 | 10:04 PM