My South Diva: పన్నెండు మంది ముద్దుగుమ్మలతో...

ABN , Publish Date - Jan 31 , 2026 | 02:40 PM

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ మై సౌత్‌ దివా ప్రతిష్టాత్మకమైన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ విడుదలైంది.

My South Diva Calendar

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్‌స్టైల్ ప్లాట్‌ఫామ్ మై సౌత్‌ దివా (My South Diva) ప్రతిష్టాత్మకమైన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ విడుదలైంది. ఈ కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది.

ఈ ప్రత్యేక క్యాలెండర్‌లో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్, మనస్వి మంగై, చాంద్సీ కటారియా, సాక్షి మ్హాడోల్కర్, సిమ్రత్ కౌర్, గెహ్నా సిప్పీ, రియా సుమన్, ఐశ్వర్య సాల్వి... ఇలా 12 నెలలు 12 మంది నటీమణులను ప్రచురించారు. స్టైల్, గ్రేస్, ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అద్దం పడుతూ రూపొందిన ఈ క్యాలెండర్ ను ప్రతి నెల ఒక ప్రత్యేక థీమ్‌తో మహిళా శక్తి, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.


DSC_4404.JPG

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టాలీవుడ్ నటీమణులు, మోడల్స్ గెహ్నా సిప్పీ, రియా సచ్ దేవా, ఐశ్వర్య సాల్వి, ఉల్క గుప్తా, భారతి సిమెంట్స్ డీఎం రవీంద్ర రెడ్డి, సినీ నిర్మాతలు రమేష్ పుప్పాల, శ్యాంసుందర్ నేతి, మీడియా9 డైరెక్టర్ మనోజ్ కుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మై సౌత్‌ దివా డైరెక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, 'ఈ క్యాలెండర్ ప్రతిభ, అందం, ఆత్మబలం వంటి విలువలను సెలబ్రేట్ చేసే మా దృష్టిని ప్రతిబింబిస్తుంది. యువతులను ప్రేరేపిస్తూ, మీడియాలో సానుకూల దృక్పథం తీసుకురావడమే మా లక్ష్యం. ప్రతి నెల ఒక ప్రత్యేక భావనతో మహిళా శక్తిని ప్రతినిధ్యం వహించేలా దీనిని రూపొందించాం' అని తెలిపారు.

Updated Date - Jan 31 , 2026 | 02:42 PM