Moharram: మొహరం.. పండుగ‌ స్పెష‌ల్ సాంగ్స్‌! అదిరిపోయాయి

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:28 PM

మ‌నం ఇప్ప‌టివ‌ర‌కు సినిమా పాట‌లు, పండుగ పాట‌లు, పార్టీ, డీజే అంటూ వివిధ ర‌కాల పాట‌లు వింటుంటాం.

Moharram Song

మ‌నం ఇప్ప‌టివ‌ర‌కు సినిమా పాట‌లు, పండుగ పాట‌లు, పార్టీ, డీజే అంటూ వివిధ ర‌కాల పాట‌లు వింటుంటాం. కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియా విస్తృతం కావ‌డంతో ప్ర‌తి సంద‌ర్భానికొక గీతం అంటూ ప్ర‌త్యేకంగా రూపొందించి విడుద‌ల చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఈ సంస్కృతి అధికంగా ప్రాచుర్యంలోకి వ‌స్తున్న‌ది. ఇప్ప‌టికే బోనాలు, ద‌స‌రా, దీపావ‌ళి, సంక్రాంతి, బ‌తుక‌మ్మ, శివ రాత్రి, ఇలా ప్ర‌తి పండుగ‌కు ఒక గీతాన్ని యువ గాయ‌నీ గాయ‌కులు విడుద‌ల చేస్తూ త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌ను నిరూపించుకుంటున్నారు.


ఈ కోవ‌లోనే తాజాగా ముస్లింలు జ‌రుపుకునే మొహరం (MOHARRAM) పండుగ‌కు సంబంధించి ప్ర‌త్యేకించి పాటల‌ను విడుద‌ల చేయ‌డం శ్రోత‌ల‌ను అశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. అంతేగాక మంచి వ్యూస్‌ను సైతం రాబ‌ట్టుకుంటున్నాయి. అయితే ఈ పండుగ‌ను తెలుగు రాష్ట్రాల‌లోని ప‌ల్లెల్లో ముఖ్యంగా తెలంగాణ‌లో ఇప్ప‌టికీ కులమతాలకు 'పీర్ల పండుగ' లేదా ' అలాయి బెలాయి'గా జ‌రుపుకోవ‌డం అన‌వాయితీగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ఔత్సాహిక సింగ‌ర్స్ ప్ర‌త్యేకించి ఈ పండుగ నేప‌థ్యంలో పాటలు రూపొందించి త‌మ త‌మ యూట్యూబ్‌ ఛాన‌ళ్ల‌లో విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అవేంటో.. ఏవిధంగా మీరూ ఓ చెవి వేయండి.


ముఖ్యంగా లేవు లేవు మియా సాబు.. లేవ‌వ‌య్యా ఖాసీం సాబు (LEVU LEVU MIYYASAAB) అంటూ ప్ర‌ముఖ ఫోక్ సింగ‌ర్ ప్ర‌భ (Prabha) స్వ‌యంగా సాహిత్యం అందించి ఈ పాట‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజేంద‌ర్ కొండాతో క‌లిసి ఆల‌పించింది. ఇవేగాక కోయ‌ల‌కొండ ఖాసీము, అలిగిన‌వా ఖఆసీము, ఎట్లా దున్కెనురా బీబీ ఫాతిమా (ETLADHUNKERA BEEBIPATHIMA), యానాగుంది మౌలాలి ద‌ర్గాలో ఉన్నాడో, మంచి మంచి ద‌ట్టీల‌న్నీ వ‌చ్చినాయి అంటూ సాయికిర‌ణ్ ముదిరాజ్ వంటి మ‌రికొంత‌మంది సింగ‌ర్స్ అల‌పించిన‌ సాగే పాట‌లు సైతం యూట్యూబ్‌లో దూసుకు పోతున్నాయి.


ఇదిలాఉంటే మొహ‌రం అనేది ఇస్లాం క్యాలెండ‌ర్ ప్ర‌కారం ముస్లింల‌కు నూత‌న సంవ‌త్స‌రం మొద‌టి నెల‌. ఈ నేప‌థ్యంలో జూన్ 16న ఈ నెల ప్రారంభం అవ‌గా అ రోజు నుంచి ప‌ది రోజుల పాటు జూన్ 25 (అషురా) వ‌ర‌కు ముస్లింలు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉంటారు. చివ‌రి రోజున‌ ప్ర‌వ‌క్త మ‌నవ‌డు ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ విషాద దినంగా ఒంటిపై ర‌క్తం వ‌చ్చేలా గాయాలు చేసుకుంటూ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తారు.

Updated Date - Jun 19 , 2026 | 04:56 PM