'మన్యం ధీరుడు'కి ఉత్తమ చిత్రం అవార్డు
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:41 PM
'మన్యం ధీరుడు' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది.
'మన్యం ధీరుడు' (Manyam Dheerudu) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును 'మన్యం ధీరుడు' చిత్రాన్ని వరించింది.
మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయ రావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ, శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రదానం చేశారు. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించిన చిత్రం 'మన్యం ధీరుడు' . నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఆర్ వి వి సత్యనారాయణ టైటిల్ పాత్ర పోషించారు. 2024 సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదలైంది.