‘కపుల్ ఫ్రెండ్లీ’ రెట్టింపు ఉత్సాహానిచ్చింది..
ABN , Publish Date - Apr 25 , 2026 | 09:07 PM
ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో చక్కని విజయం అందుకున్నారు మానస వారణాసి. తాజాగా ఆమె చేతుల మీదుగా ‘అనుటెక్స్’ నూతన బ్రాంచ్‌ను ఆర్‌సీ పురంలో ప్రారంభించారు.
ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో చక్కని విజయం అందుకున్నారు మానస వారణాసి(Manasa Varanasi). తాజాగా ఆమె చేతుల మీదుగా ‘అనుటెక్స్’ నూతన బ్రాంచ్‌ను ఆర్‌సీ పురంలో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ‘అనుటెక్స్’ నా చిన్నతనం నుంచి వింటున్న బ్రాండ్. 1970ల కాలంనాటి నుంచి నాణ్యతకు కేరాఫ్‌గా నిలిచిన ఈ స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఎన్నో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడవాలని కోరుకుంటున్నా’ అన్నారు. సినిమాల గురించి మాట్లాడుతూ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సక్సెస్ నా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మంచి కథల కోసం ఎదురుచేస్తున్నా. ఇటీవల పలు కథలు విన్నాను. త్వరలో అప్‌డేట్ వస్తుంది’ అని అన్నారు.

‘రోజువారీ దుస్తుల నుంచి స్పెషల్ డేస్ పండుగలకు అన్ని రకాల కలెక్షన్లు అన్ని అందుబాటులో ఉంటాయి. పాకెట్ ఫ్రెండ్లీ అన్నదే మా కాన్సెప్ట్. నాణ్యత తగ్గించకుండా అందరికీ ధరలు అందుబాటులో ఉండాలన్నదే మా ఆలోచన. ఐదు దశాబ్ధాలుగా ఈ రంగంలో కొనసాగడం ఆనందంగా ఉందని అధినేత శ్రీను తెలిపారు.