Lisa Ray: హైద‌రాబాద్‌కు.. మ‌హేశ్‌బాబు హీరోయిన్‌

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:52 AM

మహిళల ఆరోగ్యంపై మెనోపాజ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించేందుకు బాలీవుడ్ నటి లీసా రే హైదరాబాద్‌కు రానున్నారు.

Lisa Ray

మహిళల ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపే మెనోపాజ్‌ గురించి అవగాహన కలిగించేందుకు ప్ర‌ముఖ మోడ‌ల్‌, బాలీవుడ్ నటి లీసా రే (Lisa Ray) హైదరాబాద్‌కు రానున్నారు. జీర్ణక్రియ నుంచి ఎముకల సాంద్రత వరకు మహిళల ఆరోగ్యంపై మెనోపాజ్ పలు మార్పులు తీసుకొచ్చినప్పటికీ, దాని లక్షణాలు, ప్రభావాలపై ఇప్పటికీ సరైన అవగాహన చాలా మందిలో లేదు. ఈ నేపథ్యంలో మెనోపాజ్‌పై చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో జూన్ 18న నగరంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో లీసా రే పాల్గొననున్నట్లు న్యూ హర్ (New Her) సంస్థ వెల్లడించింది.

Lisa Ray

ఇదిలాఉంటే.. ఇండో - కెన‌డియ‌న్ న‌టి అయిన లీసారే తెలుగులో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న 'ట‌క్క‌రి దొంగ' సినిమాలో న‌టించి మెప్పించింది. ఆపై హిందీలో ప‌లు సినిమాలు చేసిన ఈ బ్యూటీ త‌ర్వాత క్యాన్స‌ర్ బారిన ప‌డి చాలా కాలంఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది. తిరిగి క్యాన్స‌ర్‌ను జ‌యించి వ‌చ్చిన లీసా రే సినిమాల క‌న్నా క్యాన్స‌ర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌పై ఎక్కువ‌ దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆమె హైద‌రాబాద్‌కు రానుంది.

Updated Date - Jun 15 , 2026 | 01:36 PM